Skip to main content

Hollywood Films: ఈ హాలీవుడ్‌ సినిమాలు చూస్తే ఇక జైలుకే!

హాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ కఠిన చర్యలను ప్రకటించారు.
Hollywood Films

పిల్లలు హాలీవుడ్‌ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని ఆరు నెలలపాటు నిర్బంధ లేబర్‌ క్యాపులకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సదరు పిల్లలు ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవాల్సి ఉంటుందని కూడా ప్రకటించారని మిర్రర్‌ పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వారిని గట్టి హెచ్చరికలతో వదిలేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇన్మిబన్‌ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్‌ తెలిపింది. అంటే ప్రతి ఒక్కరూ తమ పక్క ఇళ్లలో ఏం జరిగే వాటిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది.  డ్యాన్సులు, పాటలు పాడటం, మాట్లాడటంపైనా కిమ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  

Zombie Drug: అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!

Published date : 01 Mar 2023 12:24PM

Photo Stories