BIMSTEC: కొలంబోలో సాంకేతికత బదిలీ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం
Sakshi Education
BIMSTEC: ఏ దేశ రాజధానిలో బిమ్స్‌టెక్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ సెంటర్ ఏర్పాటు కానుంది?
BIMSTEC technology transfer centre set up in Colombo
శ్రీలంక రాజధాని కొలంబోలో ‘బిమ్స్‌టెక్’ ఆధ్వర్యంలో సాంకేతికత బదిలీ కేంద్రం ఏర్పాటుకు ఉద్దేశించిన సహకార ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ–సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్స్‌టెక్)’ సభ్య దేశాలు... 2021 మార్చి 30న జరిగిన సదస్సులో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. బిమ్స్‌టెక్ సభ్య దేశాల మధ్య సాంకేతికత బదిలీలో సహకారాన్ని బలోపేతం చేయడం.. ఈ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ సెంటర్ ప్రధాన లక్ష్యం.