Abortion Banned in US: ఇక అమెరికాలో అబార్షన్ హక్కు కాదు
Sakshi Education
అమెరికాలో గర్భవిచ్ఛిత్తి(అబార్షన్ )కి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశంలో అబార్షన్ చేయించుకునేందుకు వీలుగా మహిళలకు దాదాపు 50ఏళ్లుగా అందుబాటులో ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలకు ముగింపు పలికింది. గర్భవిచ్ఛిత్తిని నిషేధించే విషయంలో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. 5–3 మెజార్టీతో సంబంధిత తీర్పు వెలువడింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 25 రాష్ట్రాలు గర్భవిచ్ఛిత్తిపై త్వరలోనే నిషే«ధం విధించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అమెరికా అధ్యక్షుడు బైడెన్ తప్పుపట్టారు. అబార్షన్ విషయంలో మహిళల హక్కులను కాపాడేందుకు తన అధికారాలను ఉపయోగించుకుంటూ అవసరమైన కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 04 Jul 2022 06:30PM