Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 80కి పైగా ప్రకంపనలు
రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేనప్పటికీ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. మస్బేట్ ప్రావిన్స్‌లోని మియాగా తీర గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. 80కి పైగా ప్రకంపనలు నమోదైనట్లు ఫిలిప్పీన్స్ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.
ఈ ప్రావిన్స్ మూడు ద్వీపాలలో దాదాపు పది లక్షల మంది జనాభాను కలిగి ఉంది. రాజధాని మాస్బేట్ సిటీలోని కొన్ని భవనాలు ప్రావిన్షియల్ హాస్పిటల్‌తో సహా వాటి గోడలలో పగుళ్లు ఉన్నాయని మాస్బేట్ ప్రావిన్షియల్ డిజాస్టర్ ఆఫీసర్ అడోనిస్ దిలావో చెప్పారు. నగరంలోని స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వేదిక లోపల సీలింగ్‌లోని ఒక భాగం కూలగా, విద్యుత్ పోస్ట్‌లు, పార్క్ చేసిన కార్లు కూడా కదిలాయన్నారు.