Skip to main content

Russia Vs Ukraine : ఆ ప్రాంతాలు త్వరలో విలీనం

ఉక్రెయిన్‌లోని డొనెట్స్‌క్, లెహాన్స్‌క్, జపోరిజియా, ఖెర్సన్‌ తదితర ఆక్రమిత ప్రాంతాలను లాంఛనంగా విలీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో రష్యా అధికారులు ఇప్పటికే రిఫరెండం నిర్వహించడం తెలిసిందే.
4 Ukrainian separatist regions plan votes to join Russia
4 Ukrainian separatist regions plan votes to join Russia

జపోరిజియాలో 93 శాతం, ఖెర్సన్‌లో 87, లుహాన్స్‌క్‌లో 98, డొనెట్స్‌క్‌లో 99 శాతం విలీనానికి ఓటేసినట్టు వారు ప్రకటించారు. కాబట్టి ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవాల్సిందిగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కోరనున్నట్టు సెప్టెంబర్ 28న చెప్పారు. సైన్యంతో బెదిరించి బలవంతంగా విలీనానికి ఒప్పిస్తున్నట్టు విమర్శలు వినిపస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా బూటకమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇప్పటికే తూర్పారబడుతున్నాయి. లక్షలాది బలగాలను ఉక్రెయిన్‌లోకి తరలిస్తామని పుతిన్‌ ప్రకటించడం, అణ్వాయుధాల ప్రయోగానికీ వెనుదీయబోమని హెచ్చరించడం తెలిసిందే.

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 26th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 29 Sep 2022 07:37PM

Photo Stories