Skip to main content

World Development Report: 120 శాతం పెరిగిన ప్రవాసుల సంపాదన

World Development Report

విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు బాగానే సంపాదిస్తున్నారు. దేశీయ వలసదారుల ఆదాయంలో 40 శాతం వృద్ధి నమోదు కాగా, విదేశాల్లో పనిచేసే భారతీయుల ఆదాయంలో 120 శాతం పెరుగుదల కనిపించిందని ప్రపంచ అభివృద్ధి నివేదిక(డబ్ల్యూడీఆర్‌)–2023 వెల్లడించింది. అమెరికాకు వలస వెళ్లిన తక్కువ నైపుణ్యాలు గల భారతీయుల ఆదాయంలో 500 శాతం వృద్ధి నమోదైందని, ఈ వృద్ధి యూఏఈలో 300 శాతంగా ఉన్నదని నివేదిక తెలిపింది. గల్ఫ్‌లో భారతీయుల ఆదాయంలో తక్కువ వృద్ధి నమోదైందని నివేదిక వెల్లడించింది. నైపుణ్యాలు, వయసు, పని చేసే దేశం, భాషా సామర్థ్యాలు వ్యక్తుల ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని డబ్ల్యూడీఆర్‌తెలిపింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 09 May 2023 06:46PM

Photo Stories