Skip to main content

World Liver Day 2023: నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ప్రతి సంవ‌త్సరం ఏప్రిల్ 19వ తేదీ ప్రపంచ కాలేయ దినోత్సవం (World Liver Day)గా జరుపుకుంటున్నాం.

లివ‌ర్‌ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించాల‌నే ఉద్దేశంతో ప్రతి ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేర‌కు కాలేయ వ్యాధుల తీవ్రత, ముందస్తుగా గుర్తించడం, నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు. 
2023 వరల్డ్ లివర్ డే థీమ్ "అప్రమత్తంగా ఉండండి, రెగ్యులర్ లివర్ చెక్ అప్ చేయించుకోండి. ఫ్యాటీ లివర్ ఎవరినైనా ప్రభావితం చేస్తుంది(Be Vigilant, Do Regular Liver Check-Up, Fatty Liver Can Affect Anyone)". ఊబకాయం (అధిక బరువు), ఇన్సులిన్ నిరోధకత (మధుమేహం), ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వంటి కారకాలతో లివర్ వ్యాధులు సంభవిస్తున్నాయి. కాబట్టి రెగ్యులర్ లివర్ చెక్ అప్‌ల అంశాన్ని ఈ సంవ‌త్స‌రం నొక్కి చెప్పడంపై థీమ్ దృష్టి సారిస్తుంది. 

World Health Day: మనం తినే ఆహారమే ఔషధం..

కాలేయ క్యాన్సర్ మరణాల్లో భారతదేశం 10వ స్థానంలో ఉంది. కాగే భారతదేశంలో 70% మంది ఫ్యాట్ ఊబకాయంతో, 15% మంది కొవ్వు కాలేయంతో బాధపడుతున్నారు. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా క‌లేయ సంబంధిత వ్యాధుల‌తో భాద‌ప‌డుతున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా సంవ‌త్స‌రానికి 20 లక్షల మంది కాలేయ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. వీరిలో సిర్రోసిస్ సంబంధిత కారణాలు కేవలం సగం మాత్రమే, మిగిలినవి వైరల్ హెపటైటిస్, హెపాటోసెల్లర్ (కాలేయం) క్యాన్సర్ వల్ల సంభవిస్తున్నాయి. సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3.5% మరణాలు సంభవిస్తున్నాయి. 
కాలేయం ప్ర‌త్యేక‌త‌లు..
కాలేయం మానవ శరీరంలో రెండో అతిపెద్ద, అత్యంత కీలకమైన అవయవం. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, టాక్సిన్స్ వడపోత, విటమిన్లు, ఖనిజాలు, గ్లూకోజ్ మొదలైన వాటి నిల్వ కోసం ఇది అనేక విధులను నిర్వహిస్తుంది. 60 నుంచి 70% వరకు దెబ్బతిన్న తర్వాత కూడా తిరిగి పునరుత్పత్తి కావడం దీని ముఖ్య  ప్రత్యేకత.

National Vaccination Day 2023: ఆరోగ్యానికి వరం టీకా ఔషధం..  
తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..
ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయాలి
మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
సమయానికి అవసరమైన టీకాలు తీసుకోవాలి.
మ‌నిషికి త‌గ్గ‌ బరువు ఉండేలా చూసుకోవాలి.
హెపటైటిస్ వ్యాక్సీన్‌లు తీసుకోవ‌టం ద్వారా కూడా లివర్ వ్యాధులను నివారించుకోవచ్చు.  

Jallianwala Bagh Massacre: జలియన్ వాలాబాగ్ ఊచకోత‌కు 104 ఏళ్లు..

Published date : 19 Apr 2023 01:18PM

Photo Stories