Zero Defect Zero Effect: జెడ్‌ఈడీ సర్టిఫికేషన్ స్కీమ్ ప్రధాన లక్ష్యం?
సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పురోగతి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జెడ్‌ఈడీ (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్) సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే ఏప్రిల్ 28న న్యూఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, లాభాలను పెంచడం, పర్యావరణంపై హానికరమైన పద్దతులను నియంత్రించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సంబంధించి తాజా పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకం కాంస్య, వెండి, బంగారంతో సహా మూడు ధృవీకరణ స్థాయిలను కలిగి ఉంటుంది.
GK Persons Quiz: హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ బోర్డు ఛైర్మన్ గా నియమితులైనది?
ఎంఎస్‌ఎంఈ ఛాంపియన్స్ పథకంలో భాగమైన జెడ్‌ఈడీ ధృవీకరణ పథకం ద్వారా వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చని, ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని, పర్యావరణ స్పృహపై అవగాహన పెరుగుతుందని, సహజ వనరులను అత్యుఉత్తమంగా ఉపయోగించుకోవచ్చని, మార్కెట్ విస్తరించుకోవచ్చని మంత్రి నారాయణ్ రాణే వెల్లడించారు.Cement Supply: దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా ప్రారంభించిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జెడ్‌ఈడీ (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్) సర్టిఫికేషన్ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పురోగతి లక్ష్యంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్