PhonePe: ఈ దేశంలో యూపీఐ సేవలు ప్రారంభించిన ఫోన్‌పే
Sakshi Education
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ద్వారా సింగపూర్‌లో తమ వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తాజాగా తెలియజేసింది.
ఈ మేరకు సింగపూర్ టూరిజమ్ బోర్డు (ఎస్‌టీబీ)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సంస్థ తెలిపింది. భారత్, సింగపూర్‌ల మధ్య ఇప్పటికే ఉన్న యూపీఐ అనుసంధానతపై ఈ ఒప్పందం కుదిరిందని, ఖాతాదార్లు తమ ప్రస్తుత భారతీయ బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా రెండు దేశాల మధ్య విదేశీ లావాదేవీలను (క్రాస్-బోర్డర్ ట్రాన్సాక్షన్స్) తక్షణమే అనుమతిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
కొవిడ్ పరిణామాలు, పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాల తర్వాత దేశంలో యూపీఐ వాడకం పెరిగింది. డిజిటల్ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూపీఐ లావాదేవీలు గతేడాదిలోనే వెయ్యి కోట్ల మార్కును అధిగమించాయి. 2023 అక్టోబరులో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,141 కోట్లకు చేరింది. దీంతో వాటి విలువ రూ.17.16 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎన్‌పీసీఐ అధికారిక ప్రకటలో తెలిపింది.
Retail brands: దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం.. రిటైల్ బ్రాండ్లకు కొత్త అవకాశాలు
Published date : 05 Apr 2024 10:41AM