Retail brands: దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం.. రిటైల్ బ్రాండ్లకు కొత్త అవకాశాలు
Sakshi Education
ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతుండడంతో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై దృష్టి పెడుతున్నాయి.
భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్‌సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి.
రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలు:
- 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం.
- మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ విస్తరణ.
- పేరొందిన మాల్స్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టూరిస్టులను ఆకర్షించేలా బ్రాండ్ల ప్రదర్శన.
- భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తుల అందించడం.
కొన్ని ఉదాహరణలు:
- అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైన రిటైల్ స్టోర్లు ప్రారంభం.
- వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థల కార్యకలాపాల విస్తరణ.
ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుదలకు కారణాలు:
- టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వ చర్యలు.
- ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్‌మార్కెట్లు వంటి రంగాల నుండి భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తుల అందించడం.
India's Transition: భారతదేశం.. కనీస వేతనం నుంచి జీవన వేతనానికి పరివర్తన
Published date : 30 Mar 2024 03:28PM