Skip to main content

Medicines Patent Pool: ఎంపీపీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న ఫార్మా దిగ్గజం?

Pfizer

కరోనా వైరస్‌ను కట్టడికి తాము ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్‌ మాత్రల్ని ఇతర కంపెనీలూ తయారు చేయడానికి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ అంగీకరించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన జెనీవాకి చెందిన మెడిసన్స్‌ పేటెంట్‌ పూల్‌(ఎంపీపీ) బృందంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని నవంబర్‌ 16న ఫైజర్‌ సంస్థ తెలిపింది.

ప్రపంచ జనాభాలో 53 శాతం మందికి...

ఎంపీపీ సంస్థ నిరుపేద దేశాలకు తక్కువ ధరలకే మందుల్ని పంపిణీ చేస్తోంది. ఫైజర్‌ చేసుకున్న ఒప్పందం ద్వారా ప్రపంచ జనాభాలో 53 శాతం మందికి కోవిడ్‌ మాత్రలు అందుబాటులోకి వస్తాయి. ఫైజర్‌ కంపెనీ రాయల్టీలను వదులుకోవడంతో 95 దేశాల్లో ఈ మాత్రల్ని అత్యంత చౌక ధరలకే పంపిణీ చేయవచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ మాత్రల్ని మార్కెట్‌లోకి తెస్తామని ఎంపీపీ పాలసీ చీఫ్‌ ఎస్టెబన్‌ బరోన్‌ చెప్పారు.

 

ఐవోసీతో ఎన్‌టీపీసీ జట్టు

పునరుత్పాదక విద్యుదుత్పత్తికి సంబంధించి ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎన్‌టీపీసీ, ఇండియన్‌ ఆయిల్‌ (ఐవోసీ) చేతులు కలిపాయి. తక్కువ కర్బన ఉద్గారాలతో సొంత ప్లాంట్లలో పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తికి కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.
 

చ‌ద‌వండి: ప్రధాని మోదీ ప్రారంభించిన ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన జెనీవాకి చెందిన మెడిసన్స్‌ పేటెంట్‌ పూల్‌(ఎంపీపీ) బృందంతో ఒప్పందం
ఎప్పుడు  : నవంబర్‌ 16
ఎవరు    : అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌
ఎందుకు : కరోనా వైరస్‌ను కట్టడికి ఫైజర్‌ ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్‌ మాత్రల్ని ఇతర కంపెనీలూ తయారు చేయడానికి..

చ‌ద‌వండి: ప్రధాని మోదీ ప్రారంభించిన ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ ఉద్దేశం?డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 17 Nov 2021 02:29PM

Photo Stories