NLMC: నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశం?
ప్రైవేటీకరిస్తున్న సంస్థలు లేదా మూసివేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన మిగులు స్థలాలు, భవంతులను మానిటైజ్ చేయడానికి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ మార్చి 9న ఆమోదముద్ర వేసింది. స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)గా పనిచేసే ఎన్‌ఎల్‌ఎంసీలో పూర్తి వాటాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. నిరుపయోగంగా ఉన్న, పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకోలేకపోతున్న ప్రధాన వ్యాపారయేతర అసెట్స్‌ను ఉపయోగంలోకి తెచ్చి, ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది మానిటైజేషన్ స్కీము లక్ష్యం. ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఇది ఊతం అందించగలదని కేంద్రం ఆశిస్తోంది.
FM Nirmala Sitharaman: ఈ–బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఆర్థిక శాఖ పరిధిలో..
ఎన్‌ఎల్‌ఎంసీ ఆర్థిక శాఖ పరిధిలో ఏర్పాటవుతుంది. వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మూసివేతలో ప్రక్రియలో ఉన్న సంస్థల అసెట్స్‌ను ఎన్‌ఎల్‌ఎంసీకి బదలాయిస్తారు. కీలకయేతర మిగులు అసెట్స్‌ను గుర్తించి, వాటి నుంచి విలువను రాబట్టడంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇది సలహాలు, మద్దతు అందిస్తుంది.
Russian invasion of Ukraine: రష్యా సావరిన్ రేటింగ్‌ను జంక్ గ్రేడ్‌కు తగ్గించిన సంస్థలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ప్రైవేటీకరిస్తున్న సంస్థలు లేదా మూసివేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన మిగులు స్థలాలు, భవంతులను మానిటైజ్ చేయడానికి..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్