Skip to main content

India Ratings: భారత బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌... స్టేబుల్‌: ఇండియా రేటింగ్స్‌

భారత్‌ బ్యాంకింగ్‌ రంగానికి 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్‌’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్‌ ప్రకటించింది.
Bank

 అయితే ఎంఎస్‌ఎంఈలకు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బ్యాంకింగ్‌ 2022 మార్చి ముగిసే నాటికి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు బ్యాంకింగ్‌పై సెప్టెంబర్‌ 7న ఒక నివేదికను విడుదల చేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలు...

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) ఇచ్చిన రుణాల్లో 8.6 శాతంగా కొనసాగవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే రుణాల విషయంలో ఈ శాతం 10.3 శాతంగా ఉండే వీలుంది.
  • కోవిడ్‌–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్‌ పటిష్టంగా ఉండడం అవుట్‌లుక్‌ యథాతథ కొనసాగింపునకు కారణం.
  • 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ ఉండబోదు.

వృద్ధి రేటు 9.1 శాతం... 
భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌  రా) ఇటీవలే 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇంతక్రితం 9.1 శాతం ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ ( ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ ( జు) నమూనా రికవరీ అని సంస్థ పేర్కొంటోంది. వృద్ధి నుంచి కొందరు  మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ బ్యాంకింగ్‌ రంగానికి 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్‌’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నాం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 7
ఎవరు    : ఇండియా రేటింగ్స్‌ 
ఎందుకు    : కోవిడ్‌–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్‌ పటిష్టంగా ఉండడంతో...
 

Published date : 23 Sep 2021 01:10PM

Photo Stories