Village Industries: 44 విలేజ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు.. ఎక్కడంటే..
2023–24 సంవత్సరంలో 68 యూనిట్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 44 యూనిట్లు మంజూరు చేయడంతో పాటు గ్రౌండింగ్ కూడా చేసినట్లు డిసెంబర్ 21(గురువారం)న ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్పత్తి రంగంలో అంటే ఇటుకల తయారీ, జ్యూట్ బ్యాగ్‌లు, పేపర్ ప్లేట్స్ వంటి వాటిని నెలకొల్పుకోవడానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
సేవా రంగం అంటే ఫొటో స్టుడియో, టెంట్ హౌస్ వంటి వాటికి గరిష్టంగా రూ. 20 లక్షలు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. విధిగా బ్యాంకు రుణం ఉండాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారికి 35 శాతం, పట్టణ ప్రాంతాల వారికి రూ.25 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 68 యూనిట్ ఏర్పాటు చేయాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 44 గ్రౌండ్ అయ్యాయని, మిగిలిన వాటికి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందులో బ్యాంకులే కీలకమని వివరించారు.