Climate Tech Investment: వాతావరణ పెట్టుబడుల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
గత అయిదేళ్లుగా వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న మొదటి పది(టాప్ 10) దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్‌కి చెందిన క్లైమేట్ టెక్ సంస్థలు 2016–2021 మధ్య కాలంలో 1 బిలియన్ డాలర్ల మేర వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు దక్కించుకున్నాయి. ప్యారిస్ ఒప్పందం(2016, ఏప్రిల్ 22) అనంతరం అయిదేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలపై లండన్ అండ్ పార్ట్‌నర్స్, డీల్‌రూమ్‌డాట్‌కో రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
అగ్రస్థానంలో అమెరికా...
నివేదిక ప్రకారం ప్యారిస్ ఒప్పందం తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ టెక్ కంపెనీల్లోకి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ పెట్టుబడులు అందుకున్న టాప్ 10 దేశాల్లో 48 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో, 18.6 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 5.8 బిలియన్ డాలర్లతో స్వీడన్ మూడో స్థానంలో నిలిచాయి. కాలుష్యకారక ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించే దిశగా అంతా సమిష్టిగా పనిచేయడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని నివేదిక పేర్కొంది.
చదవండి: డబ్ల్యూజీసీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2016–2021 మధ్య కాలంలో వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న దేశాల్లో భారత్‌కు తొమ్మిదో స్థానం
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : లండన్ అండ్ పార్ట్‌నర్స్, డీల్‌రూమ్‌డాట్‌కో
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్