Skip to main content

World Gold Council: డబ్ల్యూజీసీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

Gold Demand

భారత్‌లో పసిడికి 2022లో భారీ డిమాండ్‌ నెలకొనే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి(వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌–డబ్ల్యూజీసీ) పేర్కొంది. అయితే కోవిడ్‌–19 సంబంధ సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో 2021 మాత్రం బంగారం డిమాండ్‌ తగ్గిపోతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ‘భారత్‌లో బంగారం డిమాండ్‌కు చోదకాలు’ అన్న శీర్షికన ఒక నివేదికను విడుదల చేసింది. డబ్ల్యూజీసీ ప్రధాన కార్యాలయం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని లండన్‌ నగరంలో ఉంది.

పారస్‌ ఏరోస్పేస్‌తో జట్టు కట్టిన యూరప్‌ సంస్థ?

యూరప్‌కు చెందిన కమర్షియల్‌ డ్రోన్‌లు, సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ ఫిక్సార్‌ భారత మార్కెట్లో ప్రవేశించింది. ఇందుకోసం పారస్‌ డిఫెన్స్‌ అనుబంధ సంస్థ పారస్‌ ఏరోస్పేస్‌తో జట్టు కట్టింది. ముందుగా తమ ఉత్పత్తుల్లో ప్రధానమైన ఫిక్సిడ్‌ వింగ్‌ డ్రోన్‌ ఫిక్సార్‌007ను భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు అక్టోబర్‌ 19న వెల్లడించింది. పారస్, ఫిక్సార్‌ల ఒప్పందం ప్రకారం వచ్చే 6–8 నెలల్లో భారత్‌లోని ఆపరేటర్లకు దాదాపు 150 డ్రోన్‌లు అందించాల్సి ఉంటుంది.
 

చ‌ద‌వండి: బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌ను స్టేబుల్‌కు మార్చిన రేటింగ్‌ ఏజెన్సీ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పారస్‌ డిఫెన్స్‌ అనుబంధ సంస్థ పారస్‌ ఏరోస్పేస్‌తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్‌ 19
ఎవరు    : యూరప్‌కు చెందిన కమర్షియల్‌ డ్రోన్‌లు, సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ ఫిక్సార్‌
ఎందుకు : భారత మార్కెట్లో ప్రవేశించేందుకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Oct 2021 04:25PM

Photo Stories