IHS Markit: రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్న దేశం?
2030 నాటికి ఆసియాలో జపాన్‌ను పక్కకునెట్టి భారత్ రెండో అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించే అవకాశం ఉందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ వెల్లడించింది. అలాగే దేశ జీడీపీ జర్మనీ, బ్రిటన్‌లను దాటి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎదిగే వీలుందని పేర్కొంది. ఈ మేరకు జనవరి 7న ఒక నివేదికను విడుదల చేసింది.
ఐహెచ్‌ఎస్ నివేదికలోని ముఖ్యాంశాలు..
- ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ తరువాత ఆరో స్థానంలో ఉంది.
- భారత్ జీడీపీ 2021లో 2.7 ట్రిలియన్ డాలర్లయితే, 2030 నాటికి ఈ విలువ 8.4 ట్రిలియన్ డాలర్లకు చేరే వీలుంది.
- వృద్ధి బాటలో వేగంగా నడుస్తున్న మధ్యతరగతి, వినియోగం భారీ వృద్ధి వంటి అంశాలు భారత్‌కు లాభిస్తున్న ప్రధాన అంశాలు.
- దేశ వినియోగం 2020లో 1.5 ట్రిలియన్ డాలర్లు ఉంటే, ఇది 2030 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది.
- ఇంటర్‌నెట్ యూజర్ల సంఖ్య 2020లో 500 మిలియన్లు (50 కోట్లు) ఉంటే, 2030 నాటికి 1.1 బిలియన్‌లకు (110 కోట్లు) చేరుతుంది.
- 2021–22లో భారత్ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదవుతుంది. 2022–23లో ఈ రేటు 6.7 శాతంగా ఉంటుంది.
చదవండి: GK Persons Quiz: డిస్నీ బైజు ఎర్లీ లెర్న్ యాప్ బ్రాండ్ అంబాసిడర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2030 నాటికి జపాన్‌ను పక్కకునెట్టి భారత్ రెండో అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించే అవకాశం ఉంది
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ఐహెచ్‌ఎస్ మార్కిట్
ఎక్కడ : ఆసియాలో...
ఎందుకు : వేగవంతమైన వృద్ధి కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్