Skip to main content

Startups: ప్రస్తుతం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?

Startup

స్టార్టప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. 20 శాతం వరకు పరిమిత వాటాలను తీసుకోవడం ద్వారా స్టార్టప్‌లకు అదనపు నిధులను సమకూర్చనున్నట్టు ఫిబ్రవరి 20న చెప్పారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ఇప్పటికే ప్రకటన చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇతర ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌ మాదిరే ఈ నిధిని ప్రైవేటు ఫండ్‌ మేనేజర్లు నిర్వహిస్తారని సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్‌ ఉన్నారు.

గుజరాత్‌ టైటాన్స్‌ లోగో ఆవిష్కరణ..

2022 ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయబోతున్న గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ జట్టు లోగోను విడుదల చేసింది. ఎగిరే గాలిపటం ఆకారం స్ఫూర్తిగా ఈ లోగోను రూపొందించినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌ సాంస్కృతిక వారసత్వంలో గాలిపటాలు భాగమని, ఉత్తరాయణ పండుగలో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.

చ‌ద‌వండి: చిప్‌ల తయారీలో రూ.1,49,200 కోట్ల పెట్టుబడి పెట్టునున్న సంస్థ?

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
స్టార్టప్‌ల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు    : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌
ఎందుకు : 20 శాతం వరకు పరిమిత వాటాలను తీసుకోవడం ద్వారా స్టార్టప్‌లకు అదనపు నిధులను సమకూర్చేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Feb 2022 04:59PM

Photo Stories