International Monetary Fund: ఐఎంఎఫ్ చీఫ్‌తో మంత్రి నిర్మలా ఎక్కడ సమావేశమయ్యారు?
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవాతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఏప్రిల్ 19న అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన ఈ భేటీలో ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తదతర అంశాలపై ఇరువురు చర్చించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాలకు హాజరయ్యేందుకు మంత్రి నిర్మల వాషింగ్టన్‌కు వచ్చారు.
International Monetary Fund: ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశం?
క్రిప్టోలను కట్టడి చేయాల్సిందే..
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నిర్వహించిన అత్యున్నత స్థాయి ప్యానెల్ సమావేశంలో మంత్రి నిర్మల పాల్గొని, ప్రసంగించారు. భారత్‌లో క్రిప్టోలపై పన్ను విధింపు అన్నది వాటిల్లోకి వచ్చే పెట్టుబడుల మూలాలు తెలుసుకునేందుకే గానీ, చట్టబద్ధత కల్పించడం కాదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. క్రిప్టో ఆస్తుల్లో ప్రభుత్వం జోక్యం లేకుండా.. వాటి నియంత్రణ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)
స్థాపన: డిసెంబర్ 27, 1945
ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డీసీ (అమెరికా)
Semicon India Conference 2022: సెమీకాన్ ఇండియా తొలి సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవాతో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తదతర అంశాలపై చర్చించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్