International Monetary Fund: ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశం?
భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022లో 8.2 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ప్రపంచంలో మరే దేశ ఎకానమీ ఈ స్థాయిలో పురోగమించలేదని విశ్లేషించింది. దీనితో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశంగా భారత్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే ఏడాది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యసవ్థ చైనా 4.4 శాతం పురోగతి సాధిస్తుందని బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 19న వార్షిక వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం..
భారత్ ఎకానమీ వృద్ధి 8.2 శాతం..
- 2022 భారత్ ఎకానమీ వృద్ధి తాజా అంచనా 8.2 శాతం అయినప్పటికీ, ఇది క్రితం అంచనాల కన్నా 80 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తక్కువ.
- ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కమోడిటీ, ఆహార ధరల పెరుగుదల, పెట్టుబడులు పుంజుకోకపోవడం వంటి అంశాలు భారత్ వృద్ధి అంచనా తగ్గింపు కారణం.
- 2021లో భారత్ వృద్ధి 8.9 శాతం. 2023లో 6.9 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా.
PHDCCI: భారత్ 2022–23లో ఎన్ని బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించనుంది?
ప్రపంచ వృద్ధి 3.6 శాతం..
2022లో ప్రపంచ వృద్ధి రేటు 3.6 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ అవుట్‌లుక్ అంచనావేసింది. ఈ మేరకు క్రితం (జనవరిలో 4.4 శాతంగా అంచనా) అంచనాలకన్నా 80 బేసిస్ పాయింట్లు కుదించింది. భౌగోళిక ఉద్రిక్తతలను దీనికి కారణంగా చూపింది. 2021 ప్రపంచ వృద్ధి 6.1 శాతం. 2023లో ప్రపంచ వృద్ధి అంచనాలను 3.8 శాతం నుంచి 3.6 శాతానికి కుదించింది.
చైనా వృద్ధి రేటు 4.4 శాతం
- 2021లో 8.1 శాతం పురోగమించిన చైనా వృద్ధి రేటు 2022లో 4.4 శాతానికి తగ్గుతుంది. 2023లో ఈ రేటు 5.1 శాతంగా ఉంటుంది.
- అమెరికా 2022లో 3.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటుది. 2023లో ఈ రేటు 2.3 శాతానికి తగ్గుతుంది.
- ప్రపంచ వృద్ధి వేగం తగ్గడానికి రష్యా యుద్ధం ప్రధాన కారణం. 2022లో రష్యా ఎకానమీ 8.5 శాతం క్షీణిస్తుంది. ఉక్రెయిన్ విషయంలో ఈ క్షీణత 35 శాతంగా ఉంటుంది.
- ఇక 19 దేశాల యూరో దేశాల ఎకానమీ 2022 వృద్ధి అంచనాలు 3.9 శాతం నుంచి 2.8 శాతానికి కుదింపు.
2021–22 Financial Year: భారత్ నెలకు ఎన్ని బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశంగా భారత్ ఉంటుంది
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్
ఎక్కడ : ప్రపంచంలో..
ఎందుకు : ప్రపంచంలో మరే దేశ ఎకానమీ ఈ స్థాయిలో పురోగమించలేదని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్