4G Mobile Services: కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన యూఎస్‌ఓఎఫ్ పథకం ఉద్దేశం?
గిరిజనులకు లబ్ధి చేకూరేలా మొబైల్ సేవలు లేని మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందించేందుకు ఉద్దేశించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఓఎఫ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 17న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
యూఎస్‌ఓఎఫ్ పథకం–ముఖ్యాంశాలు
- పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ ఆధారిత మొబైల్ సేవలు అందించనున్నారు.
- సుమారు రూ.6,466 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు.
- ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఆకాంక్ష జిల్లాల్లో 1,218 గ్రామాలకు 4జీ సేవలు అందించనున్నారు.
- ఏపీలోని ఆకాంక్ష జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, కడపల్లోని మారుమూల గ్రామాలకు మొబైల్ సేవలు విస్తరించనున్నారు.
- విశాఖ జిల్లాలో 1,054, విజయనగరంలో 154, కడప జిల్లాలో 10 గ్రామాల్లో మొబైల్ సేవల విస్తరణకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. మొత్తంగా 18 నెలల్లో పనులు పూర్తి చేయనున్నారు.
- సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్ పవర్ బ్యాటరీలు ద్వారా టెలికాం టవర్స్ ఏర్పాటు చేయనున్నారు.
చదవండి: ఇటీవల ప్రారంభమైన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ఏ రాష్ట్రంలో ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఓఎఫ్) పథకానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : గిరిజనులకు లబ్ధి చేకూరేలా.. 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్) జిల్లాల్లోని మొబైల్ సేవలు లేని మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్