Skip to main content

PM Modi: ఇటీవల ప్రారంభమైన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే ఏ రాష్ట్రంలో ఉంది?

Purvanchal Expressway

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్మించిన ‘పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే’ ప్రారంభమైంది. నవంబర్‌ 17న సుల్తాన్‌పూర్‌ జిల్లా కుదేబహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవానికి మోదీ.. వాయుసేనకు చెందిన హెర్క్యులస్‌ సీ–130జే విమానంలో ఈ రహదారిపై దిగారు. ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా సుల్తాన్‌పుర్‌ వద్ద నిర్మించిన 3.2 కిలోమీటర్ల ఎయిర్‌ స్ట్రిప్‌ ఇందుకు వేదికైంది. అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా... వైమానిక దళానికి చెందిన మిరాజ్, జాగ్వార్, సుఖోయ్, ఏఎన్‌–32 యుద్ధ విమానాలు అద్భుత విన్యాసాలు చేశాయి. అవి ఈ రహదారిపై దిగి, తిరిగి ఆకాశంలోకి దూసుకెళ్లాయి.

పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే గురించి...

  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో–ఘజియాపూర్‌ మధ్య 340.8 కి.మీ. పొడవునా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. 
  • లక్నో– సుల్తాన్‌పూర్‌ హైవే మీదనున్న చాంద్‌సరాయ్‌ గ్రామం నుంచి ఈ హైవే మొదలవుతుంది. ఘజియాపూర్‌ జిల్లా హల్‌దారియా వరకు కొనసాగుతుంది.
  • లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్‌ నగర్, ఆజమ్‌గఢ్, మావూ, ఘాజీపూర్‌ జిల్లాల(మొత్తం 9 జిల్లాలు) ఈ రహదారి వెళ్తుంది.
  • దీని నిర్మాణానికి 2018 జులైలో ఆజంగఢ్‌ వద్ద మోదీ శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు అయింది.
  • ఆరు లేన్లతో నిర్మించిన దీనిని ఎనిమిది లేన్లకు విస్తరించుకునే అవకాశం ఉంది.
  • దేశ అత్యవసర పరిస్థితుల్లో వాయుసేనకు చెందిన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ కోసం సుల్తాన్‌పూర్‌ జిల్లా కుదేబహార్‌లో 3 కి.మీ.ల పొడవైన రన్‌ వే నిర్మించారు.
  • ప్రతీ వంద కిలోమీటర్లకి ప్రయాణికులు సేదతీరడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంక్‌లు, టాయిలెట్‌ సదుపాయాలు, మోటార్‌ గ్యారేజ్‌లు ఏర్పాటు చేస్తారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది.

చ‌ద‌వండి: కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా ఏ నది ఓడ్డున ఉంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం
ఎప్పుడు  : నవంబర్‌ 16
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : లక్నో–ఘజియాపూర్‌ మధ్య అనుసంధానత పెంచేందకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 17 Nov 2021 04:12PM

Photo Stories