Skip to main content

Textile Sector: ఇటీవల ఏ పరిశ్రమను పీఎల్‌ఐ స్కీమ్‌ పరిధిలోకి తెచ్చారు?

వస్త్ర పరిశ్రమ (టెక్స్‌టైల్స్‌)ను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కిందకు తీసుకువస్తూ కేంద్ర కేబినెట్‌ సెప్టెంబర్‌ 8న కీలక నిర్ణయం తీసుకుంది.

 ఇందులో భాగంగా ఈ రంగానికి రానున్న ఐదేళ్లలో రూ.10,683 కోట్లు కేటాయించింది. పరిశ్రమ పురోభివృద్ధి, ఎగుమతులు లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ విలేకరులకు తెలిపారు. ఎంఎంఎఫ్‌ (మేన్‌–మేడ్‌ ఫైబర్‌) దుస్తులు, ఎంఎంఎఫ్‌ వస్త్రాలు, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన 10 విభాగాలు/ఉత్పత్తులకు తాజా నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించింది.

13 రంగాలకు వర్తించే విధంగా పీఎల్‌ఐ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2021–22 ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి మొత్తంగా రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపులు జరిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వస్త్ర పరిశ్రమ (టెక్స్‌టైల్స్‌)ను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కిందకు తేవాలని నిర్ణయం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 8
ఎవరు    :  కేంద్ర కేబినెట్‌ 
ఎందుకు   : వస్త్ర పరిశ్రమ పురోభివృద్ధి, ఎగుమతులు లక్ష్యంగా...
 

Published date : 23 Sep 2021 01:09PM

Photo Stories