Skip to main content

Videocon Scam: కొచ్చర్‌ దంపతులకు బెయిల్‌

రుణ మోసం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టు జ‌న‌వ‌రి 9వ తేదీ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

‘‘క్యాజువల్‌ మరియు మెకానికల్‌’’ ధోరణిలో ఈ అరెస్ట్‌ జరిగిందంటూ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)ను తప్పు పట్టింది. అరెస్టులో తగిన చట్టపరమైన విధానం, వైఖరి అవలంబించలేదని 49 పేజీల ఉత్తర్వుల్లో న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పీకే చవాన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. వీడియోకాన్‌–ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణం కేసుకు సంబంధించి 2022 డిసెంబర్ 23, 2022న కొచ్చర్‌లను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం వారు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. కాగా, కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.

Chanda Kochhar: ‘ఐసీఐసీఐ’ మాజీ సీఈవో చందా కొచర్‌ అరెస్ట్‌

 

Published date : 10 Jan 2023 05:27PM

Photo Stories