Skip to main content

Banking Deal: సిటీ ఇండియాను కొనుగొలు చేయనున్న దేశీ దిగ్గజం?

Axis bank and citibank

అమెరికన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీగ్రూప్‌కి చెందిన భారత రిటైల్‌ బ్యాంకింగ్‌ వ్యాపార విభాగం ‘‘సిటీబ్యాంక్‌ ఇండియా’’ను దేశీ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ. 12,325 కోట్లుగా ఉండనుందని యాక్సిస్‌ బ్యాంక్‌ మార్చి 30న వెల్లడించింది. 2023 ప్రథమార్ధంలో డీల్‌ పూర్తి కాగలదని పేర్కొంది. అనుసంధాన ప్రక్రియ 2024 సెప్టెంబర్‌ నాటికి పూర్తి కావచ్చని అంచనా. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

BRBNMPL: నోట్ల తయారీ ఇంక్‌ యూనిట్‌ ‘వర్ణిక’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?

ఈ కొనుగోలుతో యాక్సిస్‌ బ్యాంక్‌ పొదుపు ఖాతాల సంఖ్య 2.85 కోట్లకు, బర్గండీ (ప్రీమియం) కస్టమర్లు 2.3 లక్షల పైచిలుకు, కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరతాయి. డీల్‌ ప్రకారం .. విలీనం పూర్తయ్యేవరకూ కస్టమర్లకు సర్వీసులు అందించినందుకు గాను రూ. 1,500 కోట్ల వరకూ సిటీ బ్యాంక్‌కు యాక్సిస్‌ చెల్లించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో దీటుగా పోటీపడేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌కు ఈ కొనుగోలు ఉపయోగపడనుంది.

శతాబ్దం క్రితం సిటీగ్రూప్‌ ఎంట్రీ..
సిటీగ్రూప్‌ 1902లో భారత్‌లో అడుగుపెట్టింది. 1985లో కన్జూమర్‌ బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని ప్రారంభించింది. సిటీ రిటైల్‌ ఖాతాల పరిమాణం రూ. 68,000 కోట్లుగా ఉంది. ఇందులో రిటైల్‌ రుణాల ఖాతాలు రూ. 28,000 కోట్లుగా ఉన్నాయి.  అంతర్జాతీయంగా సిటీగ్రూప్‌ లాభాల్లో భారత విభాగం వాటా 1.5 శాతం స్థాయిలో ఉంది.

Ministry of Finance: భారత ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది?

తొలి మహిళా సీఈవో జేన్‌ ఫ్రేజర్‌ సారథ్యంలోని సిటీబ్యాంక్‌ అధిక రాబడులు అందించే ఆదాయ వనరులపై దృష్టి పెట్టే క్రమంలో 13 మార్కెట్లలో రిటైల్‌ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని గతేడాది నిర్ణయించుకుంది. భారత మార్కెట్‌ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే సిటీగ్రూప్‌ తాజా డీల్‌ కుదుర్చుకుంది. సిటీబ్యాంక్‌ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సిటీ ఇండియాను కొనుగొలు చేయనున్న దేశీ దిగ్గజం?
ఎప్పుడు : మార్చి 30
ఎవరు    : దేశీ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌
ఎందుకు : ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో దీటుగా పోటీపడేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 31 Mar 2022 01:32PM

Photo Stories