GST Council Meet: ఆహార డెలివరీ యాప్‌ల సరఫరాలపై ఎంత శాతం జీఎస్‌టీ విధించనున్నారు?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో సెప్టెంబర్ 17న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో... వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి (జీఎస్‌టీ కౌన్సిల్) 45వ సమావేశం జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ అనంతరం మంత్రి నిర్మల తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
- జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5 శాతం జీఎస్‌టీ పన్ను విధింపు.
- కేన్సర్ సంబంధిత ఔషధాలపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు.
- బలవర్థకమైన బియ్యం విషయంలో 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్‌టీ రేటు కోత.
- బయో–డీజిల్ బ్లెండింగ్‌కు సంబంధించి రేటు 12 శాతం నుంచి 5 శాతానికి కుదింపు.
- వస్తు రవాణా విషయంలో రాష్ట్రాలు విధించే నేషనల్ పర్మిట్ ఫీజు జీఎస్‌టీ నుంచి మినహాయింపు
- లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగుమతి ఐ–జీఎస్‌టీ చెల్లింపు మినహాయింపు.
- అన్ని రకాల పెన్నులపై 18 శాతం జీఎస్‌టీ విధింపు
- పునరుత్పాదక రంగ పరికరాలకు 12 శాతం పన్ను విధింపు.
- కొన్ని కోవిడ్–19 ఔషధాలపై రాయితీ పన్ను రేట్లను మూడు నెలలు అంటే డిసెంబర్ 31 వరకూ పొడిగింపు.
- ఖరీదైన జోల్జెన్సా్మ, విల్టెప్సో వంటి కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు.
- పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదు. కేంద్రం, రాష్ట్రాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే ఇందుకు కారణం.
చదవండి: మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న బ్యాంక్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌ల సరఫరాలపై 5 శాతం జీఎస్‌టీ పన్ను విధించాలని నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి
ఎక్కడ : జీఎస్‌టీ కౌన్సిల్ 45వ సమావేశం(లక్నో, ఉత్తర ప్రదేశ్)
ఎందుకు : ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించడం ద్వారా...