Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 23rd కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 23rd 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Daily Current Affairs in Telugu
Daily Current Affairs in Telugu

GSAT-24 satellite : జీశాట్‌–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం


 ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌), కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌(డీఓఎస్‌) సంయుక్తంగా రూపాందించిన జీశాట్‌–24 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని బుధవారం వేకువజామున విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టారు. 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్‌–24 ఉపగ్రహాన్ని నిరీ్ణత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ  ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరాలను తీర్చేందుకు పాన్‌ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు.  ఇప్పటిదాకా 4వేల కిలోల పైన బరువు కలిగిన భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడంలో భాగంగా జూన్‌ 22 (బుధవారం) ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. జీశాట్‌–25తో డీటీహెచ్‌ అప్లికేషన్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో రెండో ప్రయోగవేదిక నుంచి జూన్‌ 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

Also read: Queen of the United Kingdom: కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2

Hydro and solar powered airport: పూర్తిగా జల, సౌర విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటున్న తొలి భారతీయ విమానాశ్రయం

 శిలాజ ఇంథనాలపై ఆధారపడకుండా కేవలం పూర్తిగా జల, సౌర విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటున్న తొలి భారతీయ విమానాశ్రయంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐఏ) రికార్డు సృష్టించింది. హైడ్రో, సోలార్‌ పవర్‌నే ఎయిర్‌పోర్టులో వినియోగిస్తున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) జూన్‌ 22 (బుధవారం) తెలిపింది. జూన్‌ 1 నుంచి లెక్కిస్తే విమానాశ్రయ 94 విద్యుత్‌ అవసరాలను జల విద్యుత్, మిగతా ఆరు శాతం విద్యుత్‌ అవసరాలను సౌర విద్యుత్‌ తీరుస్తోందని పేర్కొంది.

Also read: GK International Quiz: ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?

Arti Prabhakar: అమెరికాలో తొలిసారిగా డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ హెడ్‌ అయిన వ్యక్తి


భారతీయ మూలాలున్న అమెరికన్‌కు అధ్యక్ష భవనంలో అత్యున్నత పదవి దక్కింది. ప్రముఖ ఇండియన్‌ అమెరికన్‌ శాస్త్రజు్ఞరాలు డాక్టర్‌ ఆర్తీ ప్రభాకర్‌ను తన ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారు. దీన్ని సెనేట్‌ ఆమోదిస్తే అమెరికా చరిత్రలో తొలిసారిగా డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ హెడ్‌ అయిన శ్వేత జాతేతర వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు. 63 ఏళ్ల ఆర్తీ డిఫెన్స్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ చీఫ్‌గా చేశారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ చీఫ్‌ అయిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఢిల్లీలో పుట్టిన ఆమె మూడేళ్ల వయసున్నపుడు అమెరికా వలస వచ్చారు. 1984లో అప్లైడ్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. 

Also read: IIT Madras: ఐఐటీఎం ఆచార్యునికి ప్రతిష్టాత్మక పురస్కారం

FIH Pro League: Indian women's hockey team : భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మహిళల ప్రొ లీగ్‌లో పాల్గొన్న తొలిసారే భారత మహిళల జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అమెరికా జట్టుతో బుధవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున వందన కటారియా (39వ, 54వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... సోనిక (54వ ని.లో), సంగీతా కుమారి (58వ ని.లో) ఒక్కో గోల్‌ కొట్టారు. తొమ్మిది జట్లు పాల్గొన్న ఈ ప్రొ లీగ్‌లో భారత్‌ 14 మ్యాచ్‌లు ఆడి నిరీ్ణత సమయంలోపు ఆరింటిలో విజయం సాధించింది. ‘డ్రా’గా ముగిసిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో ‘షూటౌట్‌’లో గెలిచి, రెండింటిలో ‘షూటౌట్‌’లో ఓడిపోయింది. నిరీ్ణత సమయంలోపు నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓవరాల్‌గా 30 పాయింట్లతో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. 42 పాయింట్లతో అర్జెంటీనా టైటిల్‌ నిలబెట్టుకోగా... 35 పాయింట్లతో నెదర్లాండ్స్‌ రన్నరప్‌గా నిలిచింది.

Also read: Arti Prabhakar: అమెరికాలో తొలిసారిగా డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ హెడ్‌ అయిన వ్యక్తి
 

Rumeli Dhar Announces Retirement : అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్న ఆల్‌రౌండర్‌ రుమేలీ ధర్‌

ఆల్‌రౌండర్‌ రుమేలీ ధర్‌ ఆటకు గుడ్‌బై చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు 38 ఏళ్ల రుమేలీ ప్రకటించింది. 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన రుమేలీ 2005 వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌ చేరిన జట్టులో సభ్యురాలు. ఆమె కెరీర్‌ గాయాల కారణంగా సరిగా సాగలేదు. 2018లో జట్టులోకి పునరాగమనం చేసిన ఆమె... అదే సంవత్సరం తన చివరి మ్యాచ్‌ ఆడింది. గత ఏడాది నవంబర్‌ వరకు రుమేలీ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ఆడింది. ఓవరాల్‌గా భారత జట్టుకు ఆమె 4 టెస్టులు, 78 వన్డేలు, 18 టి20ల్లో ప్రాతినిధ్యం వహించింది.

Published date : 23 Jun 2022 06:11PM

Photo Stories