Arti Prabhakar: అమెరికాలో తొలిసారిగా డైరెక్టర్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ హెడ్ అయిన వ్యక్తి
Sakshi Education
భారతీయ మూలాలున్న అమెరికన్‌కు అధ్యక్ష భవనంలో అత్యున్నత పదవి దక్కింది. ప్రముఖ ఇండియన్ అమెరికన్ శాస్త్రజు్ఞరాలు డాక్టర్ ఆర్తీ ప్రభాకర్‌ను తన ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. దీన్ని సెనేట్ ఆమోదిస్తే అమెరికా చరిత్రలో తొలిసారిగా డైరెక్టర్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ హెడ్ అయిన శ్వేత జాతేతర వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు. 63 ఏళ్ల ఆర్తీ డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చీఫ్‌గా చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ చీఫ్ అయిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఢిల్లీలో పుట్టిన ఆమె మూడేళ్ల వయసున్నపుడు అమెరికా వలస వచ్చారు. 1984లో అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.
Also read: IIT Madras: ఐఐటీఎం ఆచార్యునికి ప్రతిష్టాత్మక పురస్కారం
Published date : 23 Jun 2022 05:53PM