Queen of the United Kingdom: కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్–2
Sakshi Education
United Kingdom Queen: అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి?
Queen Elizabeth II is the second longest reigning monarch
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2.. 96 ఏళ్ల వయసులో కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో థాయ్‌లాండ్ మాజీ పాలకుడు భూమిబల్ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టి.. రెండో స్థానంలో నిలిచారు. భూమిబల్ 70 ఏళ్ల 126 రోజులు రాజుగా ఉన్నారు. ఎలిజబెత్–2.. 1953లో సింహాసనం అధిష్టించారు. రాణి ఎలిజబెత్ మరో రెండేళ్లు పదవిలో కొనసాగితే.. ఫ్రాన్స్ లూయి–14ని కూడా దాటేసి తొలి స్థానంలో నిలుస్తారు. లూయి–14.. క్రీ.శ 1643 నుంచి క్రీ.శ 1715 దాకా అంటే.. 72 ఏళ్ల 110 రోజులు ఫ్రాన్స్‌ను పాలించారు.