Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 07 కరెంట్‌ అఫైర్స్‌

Daily Current Affairs in Telugu

New Covid Variant XE: దేశంలో తొలి ఎక్స్‌ఈ వేరియంట్‌ కేసు ఎక్కడ నమోదైంది?

Coronavirus Variant XE

వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న వేరియంట్‌గా గుర్తింపు పొందిన ఎక్స్‌ఈ వేరియంట్‌ కరోనా వైరస్‌ భారత్‌లోకి చొరబడింది.  ఈ వైరస్‌ తొలిసారిగా బ్రిటన్‌లో బయల్పడగా భారత్‌లో తొలిసారిగా ఏప్రిల్‌ 6న ముంబైలో కేసు నమోదైంది. కోవిడ్‌ రెండు డోస్‌లు తీసుకున్న 50 ఏళ్ల మహిళకు ఈ వేరియంట్‌ వైరస్‌ సోకింది. 2022, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆమె ప్రస్తుతం కోలుకున్నారని బృహాన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు.

తొలుత ఏ దేశంలో గుర్తించారు?
కోవిడ్‌ కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. 2022, జనవరి 19న తొలుత యూకేలో గుర్తించిన ఈ కొత్త వేరియంట్‌కు ‘ఎక్స్‌ఈ రీకాంబినెంట్‌(బీఏ.1బీఏ.2)’ అని పేరుపెట్టారు. ఇప్పటిదాకా వచ్చిన వేరియంట్ల కంటే ఎక్స్‌ఈ రీకాంబినెంట్‌ వ్యాప్తి అధికంగా ఉందని ఏప్రిల్‌ 2న డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో సబ్‌ వేరియంట్‌ (బీఏ.2) కంటే 10 శాతం ఎక్కువగా వ్యాపిస్తోందని పేర్కొంది. ఒమిక్రాన్‌  బీఏ.1, బీఏ.2  నుంచి రూపాంతరం  చెందినదే ఈ కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈ.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కోవిడ్‌ కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ ‘‘ఎక్స్‌ఈ రీకాంబినెంట్‌’’ గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్‌ 06
ఎవరు    : బృహాన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు
ఎక్కడ    : ముంబై

National Record: 200 మీటర్ల రేసులో కొత్త రికార్డు నెలకొల్పిన ఆటగాడు?

Amlan Borgohain

కేరళలోని కోజికోడ్‌ వేదికగా జరుగుతోన్న 25వ జాతీయ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2022లో ఏప్రిల్‌ 6న పురుషుల 200 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. అస్సాం అథ్లెట్‌ అమ్లాన్‌ బొర్గోహైన్‌ 200 మీటర్ల ఫైనల్‌ రేసును 20.52 సెకన్లలో ముగించి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం మొహమ్మద్‌ అనస్‌ (కేరళ) 20.63 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును అమ్లాన్‌ బద్దలు కొట్టాడు. ఆకాశ్‌ (ఉత్తర ప్రదేశ్‌; 20.89 సెకన్లు) రజతం, అజ్మల్‌ (కేరళ; 20.92 సెకన్లు) కాంస్యం నెగ్గారు.

అత్యంత ఎత్తయిన మురగన్‌ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
ప్రపంచంలోనే అతి ఎత్తయిన మురుగన్‌ విగ్రహం తమిళనాడులో కొలువుదీరింది. సేలం జిల్లా వాళప్పాడి సమీపంలో సేలం– చెన్నై జాతీయ రహదారిపై పుత్తిరకౌండంపాళయం ముత్తుమలై కొండ దిగువన 146 అడుగుల మురుగన్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏప్రిల్‌ 6న  ఘనంగా మహా కుంభాభిషేకం నిర్వహించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పురుషుల 200 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 6
ఎవరు    : అస్సాం అథ్లెట్‌ అమ్లాన్‌ బొర్గోహైన్‌
ఎక్కడ    : కోజికోడ్, కేరళ
ఎందుకు : 25వ జాతీయ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2022లో భాగంగా పురుషుల 200 మీటర్ల రేసు నిర్వహించిన నేపథ్యంలో.. 

Real Estate Rich List: రియల్‌ ఎస్టేట్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచిన వ్యక్తి?

Real Estate

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దేశంలోనే అత్యంత సంపన్నుడిగా డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ నిలిచారు. రూ.61,220 కోట్ల సంపద ఆయనకు ఉన్నట్టు ఏప్రిల్‌ 6న విడుదలైన ‘గ్రోహ్‌ హరూన్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ రిచ్‌ లిస్ట్‌’ ఐదో ఎడిషన్‌ తెలిపింది. మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (లోధా) ప్రమోటర్‌ ఎంపీ లోధా రూ.52,970 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారని పేర్కొంది. రియల్టీలోని టాప్‌ 100 సంపన్నుల వివరాలతో గ్రోహ్, హరున్‌ సంస్థలు సంయుక్తంగా తాజా నివేదికను రూపొందించారు. రియల్టీ వ్యాపారాల్లో  వాటాల ఆధారంగా 2021 డిసెంబర్‌ 31 నాటికి ఉన్న వివరాలను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది.

నివేదికలోని ముఖ్యాంశాలు

  • డీఎల్‌ఎఫ్‌ రాజీవ్‌ సింగ్‌ సంపద 2021లో 68 శాతం పెరిగింది. 
  • ఎంపీ లోధా, ఆయన కుటుంబ సభ్యుల సంపద 20 శాతం పెరిగింది.
  • కే రహేజా కార్ప్‌నకు చెందిన చంద్రు రహేజా, ఆయన కుటుంబ సభ్యుల సంపద రూ.26,290 కోట్లుగా ఉంది. వీరు 3వ స్థానంలో ఉన్నారు.
  • ఎంబసీ గ్రూపు ప్రమోటర్‌ జితేంద్ర విర్వాణి రూ.23,620 కోట్లతో 4వ స్థానంలో నిలిచారు.
  • ఒబెరాయ్‌ రియల్టీ అధినేత వికాస్‌ ఒబెరాయ్‌ రూ.22,780 కోట్లు, నిరంజన్‌ హిరనందాని (హిరనందన్‌ కమ్యూనిటీస్‌) రూ.22,250 కోట్లు, బసంత్‌ బన్సాల్‌ అండ్‌ ఫ్యామిలీ (ఎం3ఎం ఇండియా) రూ.17,250 కోట్లతో వరుసగా తర్వాతి స్థానాలో ఉన్నారు.
  • రాజా బగ్‌మానే (బగ్‌మానే డెవలపర్స్‌) రూ.16,730 కోట్లు, జి.అమరేందర్‌ రెడ్డి, ఆయన కుటుంబం రూ.15,000 కోట్లు, రున్వా ల్‌ డెవలపర్స్‌కు చెందిన సుభాష్‌ రున్వాల్‌ అండ్‌ ఫ్యామిలీ రూ.11,400 కోట్లతో ఈ జాబితాలో టాప్‌–10లో చోటు సంపాదించుకున్నారు.
  • 14 పట్టణాల నుంచి 71 కంపెనీలకు చెందిన 100 మంది ఈ జాబితాలో ఉన్నారు. 
  • జాబితాలోని 81 శాతం మంది సంపద 2021లో పెరిగింది. 13 శాతం మంది సంపద తగ్గింది. కొత్తగా 13 మంది జాబితాలోకి వచ్చారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
‘గ్రోహ్‌ హరూన్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ రిచ్‌ లిస్ట్‌’ ఐదో ఎడిషన్‌ ప్రకారం.. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన వ్యక్తి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 06
ఎవరు    : డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌
ఎక్కడ    : దేశంలో..​​​​​​​

India GDP Growth Rate: ఏడీబీ అంచనాల ప్రకారం.. 2022–23లో భారత్‌ వృద్ధి రేటు?

ADB Growth Rate

భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు 2022–23లో 7.5 శాతంగా నమోదవుతుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. 2023–24లో ఈ రేటు 8 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 6న ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీఓ)ను విడుదల చేసింది.

ఏడీఓలోని ముఖ్యాంశాలు..

  • భారత్‌ చక్కటి వృద్ధి తీరుతో 2022లో దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థల వృద్ధి  ఏడు శాతం ఉంటుందని అంచనా. 2023లో ఈ రేటు 7.4 శాతానికి పెరుగుతుంది.
  • పాకిస్తాన్‌ వృద్ధి రేటు 2022లో మధ్యస్థంగా 4 శాతంగా ఉంటుంది. 2023లో ఇది 4.5 శాతానికి చేరుతుంది. 
  • ఆసియాలోని పలు ఎకానమీల్లో 2022, 2023ల్లో దేశీయ డిమాండ్, రికవరీ మెరుగుపడుతుంది. అయితే ఎకానమీలకు కొన్ని సవాళ్లూ ఉన్నాయి. 
  • ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కరోనా కొత్త వేరియంట్‌ భయాలు, అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు వంటి సవాళ్లను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు 2022–23లో 7.5 శాతంగా నమోదవుతుంది
ఎప్పుడు : ఏప్రిల్‌ 06
ఎవరు    : ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ)

పీఎంజీకేఏవై వల్ల పేదరికం తీవ్రత తగ్గింది: ఐఎంఎఫ్‌

Ration

పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్‌లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విశ్లేషించింది. ఈ పథకం వల్ల కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్‌ పేపర్‌లో పేర్కొంది. ‘మహమ్మారి, పేదరికం, అసమానత: భారతదేశం నుంచి పాఠాలు’  అనే అంశంపై ఈ వర్కింగ్‌ పేపర్‌ రూపొందింది. 2004–05 నుంచి మహమ్మారి సవాళ్లు విసిరిన 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ భారతదేశంలో పేదరికం, వినియోగ అసమానతలపై ఈ పత్రం అధ్యయనం చేసింది. సుర్జిత్‌ ఎస్‌ భల్లా, కరణ్‌ భాసిన్, అరవింద్‌ విర్మానీలు రూపొందించిన ఈ వర్కింగ్‌ పేపర్‌లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

  • 2019లో కరోనా ముందు సంవత్సరంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద ఉంది. 2020 మహమ్మారి సంవత్సరంలోనూ అది తక్కువ స్థాయిలోనే కొనసాగాలా చూడ్డంలో పీఎంజీకేఏవై కీలకపాత్ర పోషించింది.
  • మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. 2022 సెప్టెంబర్‌ వరకూ ఈ పథకాన్ని పొడిగించారు.
  • 2019–20 మహమ్మారికి ముందు సంవత్సరంలో భారతదేశంలో పేదరికం 14.8 శాతంగా ఉంటే, తీవ్ర పేదరికం శాతం 0.8 శాతంగా ఉంది.  
  • ఏదు దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా 2020 మహమ్మారి సమయంలో పేదరికం (రోజుకు 1.9 డాలర్లకన్నా తక్కువ ఆర్జన) తీవ్రంగా పెరిగింది.  
  • మహమ్మారి సమయంలో భారత్‌ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల వల్ల పేదరికం తీవ్రత కట్టడిలో ఉంది. 2013లో ఆహార భద్రతా చట్టం (ఎఫ్‌ఎస్‌ఏ) అమలులోకి వచ్చినప్పటి నుండి ఆహార సబ్సిడీలు పేదరికాన్ని స్థిరంగా తగ్గించాయి. 
  • తీవ్ర పేదరిక సమస్య వాస్తవంగా భారత్‌లో పోయిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించి ప్రాతిపదికైన ఆర్జన ఇకపై 1.9 డాలర్ల నుంచి 3.2 డాలర్లకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా భారత్‌ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్‌ అధికారికంగా దేశంలో దారిద్య్రరేఖ ప్రాతిపదికలను మార్చాలి.  
  • దేశంలో మహమ్మారి వల్ల తలెత్తిన తీవ్ర పేదరిక సమస్య  ఆహార సబ్సిడీ విస్తరణ కార్యక్రమం వల్ల  దాదాపు 50 శాతం మేర సమసిపోయింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)వల్ల పేదరికం తీవ్రత తగ్గింది 
ఎప్పుడు : ఏప్రిల్‌ 06
ఎవరు    : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)
ఎక్కడ    : భారత్‌లో..
ఎందుకు : పీఎంజీకేఏవై ద్వారా ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తుండటంతో..

DIgital Payments: క్వికాన్‌ యాప్‌ను రూపొదించిన సంస్థ?

QuikOn

డిజిటల్‌ చెల్లింపుల సర్వీసులకు సంబంధించి హైదరాబాదీ సంస్థ క్వికాన్‌ ఫిన్‌సర్వ్‌ తాజాగా క్వికాన్‌ యాప్‌ను రూపొందించింది. ఏప్రిల్‌ 6న హైదరాబాద్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు, యాప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ మహేష్‌ బాబు దీన్ని ఆవిష్కరించారు. ఆధార్‌ ఆధారిత పేమెంట్‌ సిస్టమ్‌ (ఏఈపీఎస్‌) సేవలు తమ ప్రత్యేకతని సంస్థ ఎండీ పి. పరంధామ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంటర్నెట్‌ లేకుండా కూడా లావాదేవీలను సురక్షితంగా, సత్వరం నిర్వహించగలిగే సాంకేతికతతో ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు.

ఐటీపీ ఏరో నూతన కార్యాలయం
ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్, విడిభాగాల తయారీలో ఉన్న ఐటీపీ ఏరో భారత్‌లో నూతన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. రోల్స్‌ రాయిస్‌ అనుబంధ కంపెనీ అయిన ఐటీపీ ఏరో తయారు చేసిన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా సగం విమానాల్లో వాడారు.

విద్యా సహకారంపై త్వరలో ఒప్పందం
భారత్‌–ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతమున్న 27.5 బిలియన్‌ డాలర్ల నుంచి 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవడంపై దృష్టి సారించాలని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న గోయల్‌ ఏప్రిల్‌ 6న మీడియాతో మాట్లాడారు. విద్యా రంగంలో గొప్ప సహకారానికి వీలుగా ఒప్పందంపై చాలా పురోగతి దశలో ఉన్నట్టు ప్రకటించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
క్వికాన్‌ యాప్‌ను ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 06
ఎవరు    : క్వికాన్‌ ఫిన్‌సర్వ్‌  
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : డిజిటల్‌ చెల్లింపుల సర్వీసుల కోసం..

Hurun Research Institute: అత్యంత దనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న మహిళ?

Falguni Nayar

ప్రపంచంలో స్వయంకృషితో ఎదిగిన 10 మంది అగ్రగామి మహిళల్లో సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘నైకా’ వ్యవస్థాపకురాలు ఫాల్గుణి నాయర్‌ చోటు సంపాదించారని హురున్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఈ మేరకు ‘‘హురున్‌ రిచెస్ట్‌ సెల్ఫ్‌–మేడ్‌ వుమెన్‌ ఇన్‌ ద వరల్డ్‌–2022’’ జాబితాను విడుదల చేసింది. ఫాల్గుణి 7.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.57,000 కోట్ల) సంపదతో ఈ జాబితాలో స్థానం సాధించినట్లు పేర్కొంది. అలాగే టాప్‌–10 మహిళల్లో స్థానం పొందిన ఏకైక భారతీయురాలిగా నిలిచింది.

జాబితాలో భారత్‌ నుంచి ఫాల్గుణి కాకుండా.. రాధా వెంబు (3.9 బిలియన్‌ డాలర్లు) 25వ స్థానంలో, బయోకాన్‌ చైర్‌ పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా 26వ స్థానంలో నిలిచారు. రాధా వెంబు.. తన సోదరుడితో కలిసి ’జోహో’ సంస్థను ఏర్పాటు చేశారు. హురున్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన తాజా జాబితాలో మొత్తం 16 దేశాలకు చెందిన 124 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
హురున్‌ రిచెస్ట్‌ సెల్ఫ్‌–మేడ్‌ వుమెన్‌ ఇన్‌ ద వరల్డ్‌–2022 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 06
ఎవరు    : ఫాల్గుణి నాయర్, కిరణ్‌ మజుందార్‌ షా, రాధా వెంబు  
ఎందుకు : స్వయంకృషితో బిలియనీర్లుగా ఎదిగినందున..

Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించిన తొలి నాటో దేశం?

War Tank

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. ఉక్రెయిన్‌కు టీ–72 యుద్ధ ట్యాంకులు, బీవీపీ–1 సాయుధ వాహనాలు పంపుతూ చెక్‌ రిపబ్లిక్‌ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించిన తొలి నాటో దేశంగా నిలిచింది. మిగతా దేశాలన్నీ ఇప్పటిదాకా యాంటీ ట్యాంక్‌ మిసైళ్లు, చిన్న ఆయుధాలు, పరికరాలు ఇస్తూ వచ్చాయి.

పుతిన్‌ కూతుళ్లపై ఆంక్షలు
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూతుళ్లు మరియా పుతినా, క్యాథరినా తికొనోవాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. త్వరలో మరిన్ని ఆంక్షలుంటాయంటూ అధ్యక్షుడు బైడెన్‌ ట్వీట్‌ చేశారు. పుతిన్‌ కూతుళ్ల వివరాలను రష్యా అత్యంత గోప్యంగా ఉంచుతూ వస్తోంది. మరియా ఓ ప్రైవేట్‌ కంపెనీలో, క్యాథెరినా మాస్కో స్టేట్‌ వర్సిటీలో పని చేస్తున్నట్టు సమాచారం.

బుచా హత్యాకాండ దారుణం
ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో జరిగిన హత్యాకాండను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇది చాలా గంభీరమైన విషయం. దీనిపై స్వతంత్ర విచారణ జరగాల్సిందే’’ అని విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ పరిస్థితిపై లోక్‌సభలో జరిగిన చర్చకు ఏప్రిల్‌ 6న మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 06 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

General Essay - Economy

​​​​​​​US Dollar: తగ్గుతున్న డాలరు ఆధిపత్యం

రష్యా ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలనే వాంఛ అమెరికా మిత్ర దేశాలకు ఎప్పటి నుండో ఉండగా ఉక్రెయిన్‌ యుద్ధం కలిసొచ్చింది. విదేశీ బ్యాంకుల్లో 80,000 కోట్ల డాలర్లకు పైగా ఉన్న రష్యా నగదు నిల్వలపై ఆంక్షలు విధించి జప్తు చేయనారంభించి, ‘స్విఫ్ట్‌’ వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించటంతో కంపెనీల జమాఖర్చుల లావాదేవీలు నిలిచిపోతున్నాయి. రూబుల్‌ విలువ పడిపోతున్న సమయంలో, పుతిన్‌ ఎత్తుగడతో, మార్చి 24న రష్యా రూబుల్‌ తోనే తమ చమురు, గ్యాస్‌కు చెల్లించాలని ప్రపంచ దేశాలకు అల్టిమేటం జారీ చేశాడు. దీంతో ముఖ్యంగా యూరప్‌ దేశా లైన జర్మనీ, ఫ్రాన్స్‌ ఇరకాటంలో పడ్డాయి. అమెరికా ఏకంగా తాను తీసుకొన్న గోతిలో తానే పడిపోయినంత వ్య«థ చెందు తున్నది. ప్రపంచంలో 12 శాతం ముడి చమురును ఉత్పత్తి చేస్తూ యూరపు దేశాలకు అవసరమగు 40 శాతం పైగా ఇంధనాన్ని రష్యా ఎగుమతి చేస్తుంది. 

India-Nepal Relations: నేపాల్‌తో మళ్లీ సాన్నిహిత్యం

ఫ్రాన్స్‌ మాక్రోన్, జర్మన్‌ షోల్జ్‌లు రూబుల్‌ కరెన్సీ మారకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందాల ప్రకారం యూరోలో లేదా డాలరులో చెల్లిస్తామంటున్నారు. చెల్లిం పుల మొత్తం ఎలానూ స్విఫ్ట్‌ ద్వారా రష్యా ఖాతాల్లోకి జమ కాదు, అలా జరిగినా బ్యాంకుల్లోని నిల్వలను స్తంభింప జేస్తారు. పుతిన్‌ అధికార ప్రతినిధి డిమిట్రీ ప్రెస్‌కోవ్‌ మాత్రం రూబుల్‌ చెల్లింపులతోనే గ్యాసు, ఆయిల్‌ పంపిస్తామనీ, చారిటబుల్‌ సంస్థను నడపటం లేదనీ నిర్మొహమాటంగా స్పందించాడు. యుద్ధం ముందు ఒక డాలరుకు 75 రూబుళ్లు ఉన్న మారకపు విలువ, ఆంక్షలతో 145కు చేరి, ప్రస్తుతానికి 95 రూబుళ్లతో స్థిరత్వం దిశగా పయనిస్తోంది.

మరోవైపు సౌదీ అరేబియా, చైనాల మధ్య ముడి చమురు వాణిజ్యం  యువాన్‌లతో జరపటానికి సౌదీ అంగీ కరించింది. చైనా ఇంధన అవసరాలను 25 శాతం వరకూ సౌదీ అరేబియా తీరుస్తుంది. యువాన్‌లో సౌదీ లావాదేవీలు జరిపితే చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటం, డాలరు ప్రాధాన్యత తగ్గటం ఒకేసారి జరుగుతుంది. ఇప్పటికే రష్యా, చైనా యువాన్‌ వాణిజ్యానికి ముందుకొచ్చాయి. సౌదీ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ షేక్‌ మొహమ్మద్‌ నహ్వాన్‌ ఇద్దరూ వైట్‌హౌస్‌ నుండి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు స్పందించలేదంటే మధ్య ప్రాచ్యంలో డాల రుతో పాటుగా అమెరికా ఎంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కో నుందో అర్థమవుతుంది.

Economic Crisis in Sri Lanka: శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్‌ సరఫరా చేసిన దేశం?

డాలరు ఆధిపత్య వ్యతిరేక పోరులో నేను సైతం అంటూ భారత్‌ ముందుకు వస్తోంది. రష్యాతో లోగడ కుది రిన ఒప్పందం ప్రకారం తక్కువ ధరకు ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకొంటున్నది. రష్యా భారత్‌ మధ్య ఇకపై రూబుల్‌–రూపాయి వాణిజ్యం జరగనుందని వార్తలొస్తున్నాయి. వీరికి తోడు ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఈ బాటనే అనుకరించటానికి సిద్ధంగా ఉన్నాయి. 

1944లో న్యూహాంషైర్‌ బ్రెట్టన్‌ ఉడ్స్‌లో 44 సభ్యదేశాలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను, ప్రపంచ బ్యాంకులను స్థాపించి బంగారు నిల్వల ఆధారంగా అమెరికా డాలరును అంతర్జాతీయ కరెన్సీగా ప్రకటించాయి. 1971లో బంగారు నిల్వలు అమెరికా దగ్గర లేకపోవటంతో అమెరికాకు ముడి చమురును ఎగుమతి చేయబోమని అరబ్‌ దేశాలు ప్రక టించాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. మరలా నిక్సన్‌ షాక్‌ పేరిట ఫ్లోటింగ్‌ డాలరు రూపాంతరం చెంది, ఇప్పటివరకూ వాల్‌స్ట్రీట్‌లోని తన అనుకూల ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ విభాగంతో ప్రపంచ కరెన్సీలతో తనకు అను కూలంగా కరెన్సీ మార్పిడులను చేస్తోంది.

AP New Districts : కొత్త జిల్లాలు.. వీటి చ‌రిత్ర..!

కృత్రిమ డాలరు మార్పిడీకి వ్యతిరేకంగా ఫ్రాన్స్, జర్మనీ 1970 ప్రాంతంలోనే బ్రెట్టెన్‌ ఉడ్‌ సిస్టమ్‌ నుండి తప్పుకొని బలపడ్డాయి. డాలరు మార్పిడీలతో అనేక దేశాలు బలవు తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నిటితో (మెక్సికోతో తప్ప) అమెరికా వాణిజ్య లోటుతో,  సుమారు 25 లక్షల కోట్ల డాలర్ల రుణంతో ఉన్నా, తన చేతిలోని వాల్‌స్ట్రీట్‌ ఊహాజనిత ద్రవ్య పెట్టుబడులతో, ఫోరెక్స్‌ మారకాన్ని కృత్రిమంగా నడుపుతూ, ఆయుధ అమ్మకాలతో, కృత్రిమ మేధో సంపత్తితో జూదమాడుతోంది. డాలరుకు ప్రత్యమ్నాయంగా వాణిజ్యం చేయగలిగిననాడు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్న డాలరు ఆధిపత్యం పతనంగాక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.Buddiga Zamindar​​​​​​​

 

 

 

 

 

 

 

 

 

 

బుడ్డిగ జమిందార్‌
వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్,
కె.ఎల్‌. యూనివర్సిటీ ‘ 98494 91969 ‘
​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Apr 2022 05:28PM

Photo Stories