Daily Current Affairs in Telugu: 2023, జూన్ 13th కరెంట్ అఫైర్స్
G20 Meet: వారణాసిలో ‘జీ20’ డెవలప్‌మెంట్ మంత్రుల సదస్సు
డేటాను అందించడంలో అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 12న వారణాసిలో జరిగిన జీ20 దేశాల డెవలప్‌మెంట్ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్‌లో డిజిటలీకరణ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని, ఈ రంగంలో తమ అనుభవాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అవసరంలో ఉన్నవారికి రుణాలు సులభంగా లభించేలా ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వనరుల సమర్థ కేటాయింపునకు, ప్రజలకు పాలనాపరమైన సేవలు మెరుగ్గా అందించడానికి అత్యంత నాణ్యమైన డేటా అవసరమని వివరించారు. ప్రజా సాధికారతకు, డేటాను ప్రజలకు అందించడానికి టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటున్నామని వెల్లడించారు. నగరాలు, పట్టణాలే కాదు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి సైతం నాణ్యమైన డేటాను అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Kharif Crops : రైతుకు మరింత దన్ను.. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
అభివృద్ధి లక్ష్యాలు సాధిద్దాం
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధిలో వెనుకంజ వేశాయని మోదీ గుర్తుచేశారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషి చేయడం మన బాధ్యత అని సూచించారు. మన ప్రయత్నాలనీ పారదర్శకంగా, సమగ్రంగా ఉండాలన్నారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెంచాలని చెప్పారు. చాలా దేశాలు అప్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు కనిపెట్టాలని పిలుపునిచ్చారు. భారత్‌లో వందకుపైగా లక్ష్యిత జిల్లాల్లో ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి వివరించారు.
ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అవి ఇప్పుడు అభివృద్ధి ఉత్ప్రేరకాలుగా మారాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ డెవలప్‌మెంట్ మోడల్‌ను అధ్యయనం చేయాలని జీ20 దేశాల మంత్రులకు నరేంద్ర మోదీ సూచించారు. ప్రకృతిని ఆరాధించడం భారత్‌లో ఒక సంప్రదాయంగా వస్తోందన్నారు. వాతావరణ మార్పుల నియంత్రణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేవారు. తమ దేశంలో మహిళా సాధికారతకు ఎలాంటి పరిమితులు లేవన్నారు. సమాజంలో మార్పునకు, ప్రగతికి మహిళలే సారథులని తేల్చిచెప్పారు. అభివృద్ధి ఎజెండాను వారే నిర్దేశిస్తారని అన్నారు.
Egg Production: దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానం.. మొదటి స్థానాల్లో ఉన్న 5 రాష్ట్రాలవే..
కాశీని సందర్శించండి
ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వారణాసి అత్యంత పురాతన నగరమని ప్రధాని మోదీ తెలియజేశారు. విజ్ఞానానికి, చర్చకు, సంవాదానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు వారణాసి కొన్ని శతాబ్దాలుగా ముఖ్యమైన కేంద్రంగా వెలుగొందుతోందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల కలయికకు ఇదొక కూడలి అని చెప్పారు. భారత్‌లోని భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ చూడొచ్చని అన్నారు. సదస్సు జరిగే గదులకే పరిమితం కాకుండా కాశీ నగరాన్ని సందర్శించాలని, కాశీ స్ఫూర్తిని అనుభూతి చెందాలని జీ20 దేశాల మంత్రులకు మోదీ విజ్ఞప్తి చేశారు. గంగా హారతిని, సారనాథ్‌ను తిలకిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించే ప్రేరణ కచ్చితంగా లభిస్తుందని తెలిపారు. వారణాసి తన సొంత నియోజకవర్గమని తాను ఈ మాట చెప్పడం లేదని మోదీ వ్యాఖ్యానించారు.
CEC Rajiv Kumar: విదేశాల్లోని భారతీయులకు ఓటు హక్కు!
Ayodhya: ‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి.. వివరాలు వెల్లడించిన ట్రస్ట్
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ వివరాలను ఆలయ అధికారులు జూన్ 12న ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘ఈ ఏడాది అక్టోబర్‌కల్లా గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుంది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణసంస్థలు లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ వారి నిపుణులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గర్భగుడితో ఉన్న ప్రధాన ఆలయంతోపాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా ఐదు మండపాలనూ నిర్మిస్తున్నారు. ఐదు మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటుచేస్తారు.
Cyclone Biparjoy: ముంచుకొస్తున్న బిపర్‌జాయ్.. భారీ వర్షాల హెచ్చరికలు.. అంతటా హైఅలర్ట్
ఇవి భక్తులకు ఆలయం ప్రాంగణం నుంచి 69 అడుగుల నుంచి 111 అడుగుల ఎత్తుల్లో గోచరిస్తాయి. ప్రధాన ఆలయం పొడవు 380 అడుగులుకాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం గర్భగుడి నిర్మాణంలో మక్రానా మార్బుల్‌తో చెక్కిన స్తంభాలు, పైకప్పు, కుడ్యాలను వినియోగించనున్నారు.
ఆలయ బరువు, అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకునేలా మొత్తంగా 392 భారీ స్తంభాలను ప్రధాన ఆలయం కోసం వాడుతున్నారు. గర్భగుడి ద్వారాలకు బంగారు పూత పూయనున్నారు. ఆలయ ప్రాకారంతో కలిపి రామాలయ విస్తీర్ణం 8.64 ఎకరాలు. ఆలయ ప్రాకారం పొడవు 762 మీటర్లుకాగా లోపలి ప్రాంగణంలో మొత్తం ఆరు ఆలయాలు నిర్మిస్తారు. భక్తుల కోసం విడిగా సదుపాయం కల్పిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది.
Most Expensive City: దేశంలో నివాస వ్యయాల పరంగా ఖరీదైన పట్టణం ఇదే.. హైదరాబాద్ స్థానం ఏంతంటే..?
Padma Awardees: ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు రూ.10 వేల పింఛను.. ఆరోగ్య భీమా కూడా..
తమ రాష్ట్రానికి చెందిన పద్మ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.10 వేల చొప్పున పింఛను అందజేయనున్నట్లు హరియాణా సీఎం ఖట్టర్ ప్రకటించారు.
పద్మ అవార్డులైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ గ్రహీతలకు పింఛనుతోపాటు ప్రభుత్వ వోల్వో బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిస్తామన్నారు. ఏడాదికి రూ.1.8 – రూ.3 లక్షల మధ్య ఆదాయం ఉన్న కుటుంబాలకు కొంత ప్రీమియంతో రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
Miss World 2023: భారత్‌లో మిస్ వరల్డ్ 2023 అందాల పోటీలు..
Silvio Berlusconi : ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కోనీ మృతి
ఇటలీలో మీడియా దిగ్గజంగా ఎదిగి రాజకీయాల్లోనూ రాణించి మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన సిల్వియో బెర్లుస్కోనీ(89) జూన్ 12న తుదిశ్వాస విడిచారు.
కొన్నాళ్లుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన జూన్ 9న మిలాన్ నగరంలోని శాన్ రఫేల్ ఆస్పత్రిలో కన్నుమూశారని ఇటలీ మీడియా తెలిపింది. హృద్రోగ సమస్యలు, ప్రోస్టేట్‌క్యాన్సర్‌తో 2020లో కోవిడ్‌కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. తొలుత బెల్లీ డ్యాన్సర్, తర్వాత మీడియా రంగంలో వేలకోట్లు సంపాదించి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏడాదికే ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ సంకీర్ణ ప్రభుత్వంలో బెర్లుస్కోనీకి చెందిన ఫోర్జా ఇటాలియా భాగస్వామిగా ఉంది.
Elon Musk's SpaceX: స్పేస్ ఎక్స్‌లో పద్నాలుగేళ్ల ఇంజనీర్
బుంగా బుంగా పార్టీలతో అప్రతిష్టపాలు
వేశ్యలు, మైనర్ బాలికలతో మిలాన్‌లోని ఆర్కోల్ విల్లాలో బుంగా బుంగా పేరుతో జరిగిన పార్టీలు బెర్లుస్కోని విచ్చలవిడి వ్యక్తిగత జీవిత కోణాన్ని బట్టబయలు చేశాయి. పలువురు మహిళలతో, టీనేజీ అమ్మాయిలతో సంబంధాలు కొనసాగించారు. 1936 సెప్టెంబర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన బెల్లీ డ్యాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించి తర్వాతి వార్తా పత్రికలు, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టీవీ నెట్‌వర్క్‌లు, అడ్వర్ట్‌టైజింగ్, సినిమా సంస్థలు, ఏసీ మిలాన్ సాకర్ టీమ్, రియల్ ఎస్టేట్ ఇలా పలు వ్యాపారాల్లో వేలకోట్లు గడించి దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. 1990లలో రాజకీయాల్లోకొచ్చి ప్రధాని అయ్యారు. ఈయనపై ఎన్నో కేసులు నమోదైనా కేవలం పన్నుల కేసులోనే దోషిగా తేలారు. 76 ఏళ్ల వయసుకారణంగా శిక్ష నుంచి తప్పించుకున్నారు.
Ivan Menezes: డయాజియో సీఈవో ఇవాన్ కన్నుమూత
Wheat To Check Prices: గోధుమ నిల్వలపై పరిమితులు విధించిన కేంద్రం
పెరుగుతున్న గోధుమ ధరలను కట్టడి చేసేందుకు నిల్వలపై పరిమితులు విధించినట్లు కేంద్రం తెలిపింది.
తక్షణమే అమల్లోకి రానున్న ఈ పరిమితులు 2024 మార్చి వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం(వోఎంఎస్‌ఎస్) విధానం కింద సెంట్రల్ పూల్ నుంచి 15 లక్షల టన్నుల గోధుమలను ఈ నెలాఖరులోగా టోకు వినియోగదారులకు, వ్యాపారులకు అందజేయనున్నట్లు వివరించింది. నిల్వలు సరిపోను ఉన్నందున గోధుమల దిగుమతి విధానాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని తెలిపింది. గోధుమల ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
Kharif Crops : రైతుకు మరింత దన్ను.. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
పంచదార ఎగుమతులకు అనుమతి లేదని వెల్లడించింది. గోధుమల నిల్వలపై కేంద్రం చివరిసారిగా 2008లో పరిమితులు విధించింది. గత నెలతో పోలిస్తే గోధుమల మార్కెట్ ధరల్లో 8% పెరుగుదల నమోదు కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గోధుమ వ్యాపారులు/హోల్ సేలర్లు 3 వేల టన్నుల వరకు, రిటైలర్లు 10 టన్నులు, మిల్లర్లయితే స్థాపిత సామర్థ్యంలో 75% వరకు గోధుమలను నిల్వ ఉంచుకోవచ్చని ఆయన చెప్పారు. వీరు ఎప్పటికప్పుడు నిల్వ సమాచారాన్ని ఆహారం, ప్రజాపంపిణీ శాఖ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
Egg Production: దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానం.. మొదటి స్థానాల్లో ఉన్న 5 రాష్ట్రాలవే..
Earthquake: ఉత్తరాదిని వణించిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జూన్ 13న (మంగళవారం) భారీ భూకంపం సంభవించింది.
మధ్యాహ్నం 1:30 తర్వాత సంభవించిన భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లా గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మణిపూర్‌లో స్వల్పంగా భూమి కంపించగా, పాకిస్థాన్‌లోని లాహోర్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో గత నెల చివర్లో ఢిల్లీలో తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి.
Ayodhya: ‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి.. వివరాలు వెల్లడించిన ట్రస్ట్
An earthquake of magnitude 5.7 on the Richter scale occurred 30km southeast of Kishtwar in Jammu & Kashmir: EMSC#Earthquake! #Delhi pic.twitter.com/K8WW2XjR6R
— Siddhant Anand (@JournoSiddhant) June 13, 2023
UNESCO: యునెస్కోలోకి మళ్లీ అమెరికా.. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకే..!
అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతులు, ప్రపంచదేశాలతో సత్సంబంధాల్లో ‘పెద్దన్న’ అనే పేరు కోసం తమతో పోటీపడుతున్న చైనాను నిలువరించేందుకు అమెరికా మరో అడుగు ముందుకేసింది.
యునెస్కోలోని చైనా పలుకుబడిని తగ్గించేందుకే అమెరికా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కృత్రిమ మేథ, సాంకేతిక విద్య వంటి అంశాల్లో యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా పాటించే ప్రమాణాలు, విధాన నిర్ణయాలను తనకు అనువుగా మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇటీవల అమెరికా ఉన్నతాధికారి ఒకరు ఆరోపించడం తెల్సిందే. దీంతో యునెస్కోలో తాజా సభ్యత్వం కోసం అమెరికా రంగంలోకి దిగుతోంది. యునెస్కోలో అమెరికా మళ్లీ చేరబోతున్నట్లు ఆ దేశ అధికారులు జూన్ 12న ప్రకటించారు. గతంలో పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకునే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా యునెస్కో నుంచి తప్పుకుంటానని బెదిరించింది.
Colombian children: విమాన ప్రమాదంలో తప్పిపోయిన 40 రోజుల తరువాత మృత్యుంజయులుగా బయటకి వచ్చిన చిన్నారులు..!
2017లో నాటి ట్రంప్ సర్కార్ యునెస్కో నుంచి వైదొలగింది. ఆనాటి నుంచి దాదాపు రూ.5,100 కోట్ల విరాళాలు ఆపేసింది. తాజాగా ఆ నిధులన్నీ చెల్లిస్తామంటూ యునెస్కో మహిళా డైరెక్టర్ జనరల్ ఆండ్రీ ఆజౌలేకు అమెరికా ఉన్నతాధికారి రిచర్డ్ వర్మ లేఖ రాశారు. గతంలో యునెస్కోకు అమెరికానే అతిపెద్ద దాతగా ఉండేది. ఇది యునెస్కోకు చరిత్రాత్మక ఘటన అంటూ అమెరికా తాజా నిర్ణయాన్ని ఆండ్రీ స్వాగతించారు.
Cooking Gas: ప్రపంచంలో 230 కోట్ల మందికి వంటగ్యాస్ లేదు.. ఐదు అంతర్జాతీయ సంస్థల నివేదికల్లో వెల్లడి
ATP Rankings: మళ్లీ నంబర్‌వన్‌గా సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్
కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో కొత్త చరిత్ర సృష్టించిన దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన అగ్ర స్థానాన్ని మళ్లీ అందుకున్నాడు.
ఏటీపీ జూన్ 12న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అతను 7,595 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. 36 ఏళ్ల జొకోవిచ్ తన కెరీర్‌లో నంబర్‌వన్‌గా 388వ వారంలోకి అడుగు పెట్టడం విశేషం. ఇప్పటివరకు టాప్‌లో ఉండి సెమీస్‌లో జొకోవిచ్ చేతిలో ఓడిన అల్‌కరాజ్ రెండో స్థానానికి పడిపోగా, రష్యా ప్లేయర్ ఖచనోవ్ మరోసారి టాప్–10లోకి అడుగు పెట్టాడు.
French Open 2023: మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన సెర్బియా స్టార్.. మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP