Skip to main content

Ivan Menezes: డయాజియో సీఈవో ఇవాన్‌ కన్నుమూత

ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌ దిగ్గజం డయాజియోకి సారథ్యం వహిస్తున్న భారతీయ సీఈవో ఇవాన్‌ మాన్యుయెల్‌ మెనెజెస్‌ (64) జూన్ 7న‌ లండన్‌లో కన్నుమూశారు.
Ivan Menezes

కడుపులో అల్సర్‌తో కొంత కాలంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెలాఖరులో ఆయన రిటైర్‌ కావాల్సి ఉంది. మెనెజెస్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కొత్త సీఈవోగా నియమితులైన డెబ్రా క్రూ..  మెనెజెస్‌ చికిత్సా కాలంలో తాత్కాలికంగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారని డయాజియో జూన్ 5నే ప్రకటించింది. ఆ ప్రకటన చేసిన రెండు రోజులకే మెనెజెస్‌ కన్నుమూశారు. మెనెజెస్‌ మృతిపై డయాజెయో చైర్మన్‌ జేవియర్‌ ఫెరాన్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

Singer Tina Turner: ప్రముఖ సింగర్ 'క్వీన్ ఆఫ్ రాక్ ఎన్ రోల్' టీనా టర్నర్ కన్నుమూత

1959 జూలై 10న పుణేలో జన్మించిన మెనెజస్‌.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ, అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో విద్యాభ్యాసం చేశారు. వర్ల్‌పూల్, నెస్లే తదితర కంపెనీల్లో పనిచేసిన మెనెజెస్‌ 1997లో డయాజియో ఏర్పాటైనప్పుడు అందులో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 2013 జులైలో సీఈవో స్థాయికి చేరారు. ఆయనకు బ్రిటన్, అమెరికా, ప్రవాస భారతీయ పౌరసత్వం ఉంది. 2023 జనవరిలో బ్రిటన్‌ ఆయనకు నైట్‌హుడ్‌ ప్రకటించింది. 

US Spelling Bee: అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా 14 ఏళ్ల భారత సంతతి దేవ్ షా

Published date : 08 Jun 2023 03:37PM

Photo Stories