Miss World 2023: భారత్‌లో మిస్ వరల్డ్ 2023 అందాల పోటీలు..
దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మన దేశం ఈ పోటీకి వేదికవుతుండటం విశేషం. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ వచ్చే నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. ఇంకా తేదీలు ఖరారు కావాల్సి ఉంది. చివరిసారిగా 1996లో ఈ పోటీకి భారత్ వేదికైంది.
‘71వ మిస్ వరల్డ్ ఫైనల్‌కు భారత్ వేదికైనట్లు ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రత్యేకమైన, విభిన్న సంస్కృతి, ప్రపంచ స్థాయి ఆకర్షణలను ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పోటీలో 130 దేశాల చాంపియన్లు అద్భుతమైన భారత్‌లో తమ నెల రోజుల ప్రయాణంలో సాధించిన విజయాలను మిస్‌వరల్డ్ ఫైనల్‌లో ప్రదర్శించనున్నారు’అని మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్, సీఈవో జులియా మోర్లే జూన్ 8న తెలిపారు. భారత్ తరఫున ఈ ఏడాది పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సిని షెట్టి ఈ పోటీల్లో పాల్గొంటారు.
ఆరుసార్లు టైటిల్ గెలిచిన భారత్
ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి టైటిల్‌ను భారత్ గతంలో ఆరుసార్లు గెలిచింది. రీటా ఫారియా(1966), ఐశ్వర్యా రాయ్(1994), డయానా హెడెన్(1997), యుక్తాముఖి(1999), ప్రియాంకా చోప్రా(2000), మానుషి చిల్లర్ (2017) ఇప్పటి వరకూ భారత్ నుంచి ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు.
Most Expensive City: దేశంలో నివాస వ్యయాల పరంగా ఖరీదైన పట్టణం ఇదే.. హైదరాబాద్ స్థానం ఏంతంటే..?