India Current Account deficit : తగ్గిన కరెంటు ఖాతా లోటు
Sakshi Education
2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంలో భారత కరెంటు ఖాతా లోటు 1.3 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 0.2 శాతానికి తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది.
India Current Account deficit
వాణిజ్య లోటు తగ్గడం, సేవల ఎగుమతులు గణనీయంగా పెరగడం కరెంటు ఖాతా లోటు తగ్గిందని వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.2% కాగా, 2022-23లో 2 శాతానికి చేరింది. వాణిజ్య లోటు 189.5 బి.డాలర్ల నుంచి 265.3 బి.డాలర్లకు పెరిగింది.
2021-22 జనవరి- మార్చిలో కరెంటు ఖాతా లోటు 13.4 బి.డాలర్లు లేదా జీడీపీలో 1.6 శాతంగా నమోదైంది. 2022-23 మూడో త్రైమాసికంలో 71.3 బి.డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు, నాలుగో త్రైమాసికంలో 52.6 బి.డాలర్లకు తగ్గడం వల్లే కరెంటు ఖాతా లోటు తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది.