Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 6th కరెంట్ అఫైర్స్
Farooq Abdullah: ఎన్‌సీ చీఫ్‌గా మళ్లీ ఫరూక్
నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లా (85) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హజ్రత్‌బల్‌లోని నసీమ్‌బాగ్‌లో ఉన్న ఎన్‌సీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా సమాధి వద్ద ఆయన 117వ జయంతిని పురస్కరించుకుని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవికి కేవలం ఒకే ఒక్క నామినేషన్ అందిందని ఎన్‌సీ ప్రధాన కార్యదర్శి అలీ మహ్మద్ సగర్ చెప్పారు. 2014లో కొడుకు ఒమర్ రాజీనామాతో ఫరూక్ పార్టీ పగ్గాలు స్వీకరించారు.
Indian Railways: 2025–26 నాటికి వందేభారత్ రైళ్ల ఎగుమతి!
Russian Oil: అమల్లోకి రష్యా చమురుపై ధరల పరిమితి
రష్యా చమురు ధరపై 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్, జీ 7 దేశాలు విధించిన బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు రష్యా నుంచి కొన్ని రకాల చమురు దిగుమతులపై ఆ దేశాలు నిషేధమూ విధించాయి. ఈయూ, జీ7 పరిమితిని రష్యా ఇప్పటికే నిర్ద్వంద్వంగా తిరస్కరించడం తెలిసిందే. పరిమితులు విధించే దేశాలకు చమురు విక్రయాలు పూర్తిగా నిలిపేస్తామని ఇంధన వ్యవహారాలు చూసే రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై వాటి నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. డిసెంబర్ 5వ తేదీ యూఎస్ బెంచ్ మార్క్ చమురు బ్యారెల్‌కు 80.88 డాలర్లు పలికింది.
World Population : పెరుగుతున్న జనాభా.. ఎన్నో సవాళ్ళు.. సదవకాశాలు
Andrew Huff: కరోనా వైరస్.. మానవ నిర్మితమే
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా వైరస్ మానవ నిర్మితమేనని చైనాలోని వూహాన్ ల్యాబ్‌లో పని చేసిన అమెరికా శాస్త్రవేత్త, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ చెప్పారు. తాజాగా విడుదల చేసిన తన పుస్తకం ‘ది ట్రూత్ ఎబౌట్ వూహాన్’లో సంచలన విషయాలు బయటపెట్టారు. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(డబ్ల్యూఐవీ) నుంచి రెండేళ్ల క్రితం కరోనా వైరస్ లీక్ అయ్యిందని వెల్లడించారు. చైనా ల్యాబ్‌లో వైరస్‌లపై పరిశోధనలకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ అనేది జన్యుపరంగా రూపొందించిన ఏజెంట్ అని చైనాకు తెలుసని వివరించారు. చైనాకు అమెరికా బయోవెపన్ సాంకేతికతను అందజేస్తోందన్నారు. సరైన భద్రతా చర్యలు లేని ప్రయోగాల కారణంగా వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా బయటకు వచ్చిందని స్పష్టం చేశారు. జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి చర్యలు ఆ ల్యాబ్‌లో లేవని ఆండ్రూ హఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్)తో చైనాలోని వూహాన్ ల్యాబ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ఎన్‌ఐహెచ్ నుంచి అందే నిధులతో గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై వూహాన్ ల్యాబ్ అధ్యయనం చేస్తోందని తన పుస్తకంలో ప్రస్తావించారు.
National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
Supreme Court: బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధం
బలవంతంగా మతం మార్చడం ముమ్మాటికీ తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. భారతదేశంలో నివస్తున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలని సూచించింది. అయితే, సమాజానికి సేవ చేయడం కోసం మరో మతంలోకి వెళితే అది బలవంతపు మత మార్పిడి కాదని పేర్కొంది. బెదిరింపులు, ప్రలోభాలతో జరిగే మత మార్పిడులను అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం డిసెంబర్ 5వ తేదీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మత మార్పిడుల వ్యవహారంపై రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. బలవంతపు మత మార్పిడులు దేశ భద్రతకు ప్రమాదకరం కావొచ్చని సుప్రీంకోర్టు గతంలో వెల్లడించింది. అంతేకాకుండా పౌరుల మత స్వేచ్ఛకు కూడా ప్రతిబంధకమేనని పేర్కొంది. ఇలాంటి మత మార్పిడులను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
World Boxing Championships: బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 11 పతకాలు
Goblin Mode: ఈ ఏడాది పదంగా ‘గోబ్లిన్ మోడ్(సోమరి స్వార్థపరుడు)’
అత్యంత సోమరిగా ఉంటూ స్వార్థ చింతనతో జీవించే వ్యక్తులను ఉద్దేశిస్తూ వాడే ‘గోబ్లిన్ మోడ్’ పదాన్ని 2022 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడేస్తూ, సామాజిక నియమాలను పాటించని స్వార్థపూరిత అపరిశుభ్ర వ్యక్తుల మానసిక వైఖరిని ‘గోబ్లిన్ మోడ్’ అని పిలుస్తుంటారు. ఒక సంవత్సరకాలంలో సమాజంలో అత్యంత సాధారణంగా వినిపించే, ప్రస్తావించే, చర్చించబడే పదాన్ని ‘ఆ ఏడాది పదం’గా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రకటిస్తోంది. సాధారణంగా ఆక్స్‌ఫర్డ్ ప్యానెల్ నిపుణులే ప్రతి ఏటా పదాన్ని నిర్ణయిస్తారు. కానీ, తొలిసారిగా ఈఏడాది ప్రజాభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తీసుకుని విజేత పదాన్ని ప్రకటించారు. ఓటింగ్‌లో దాదాపు 93 శాతం ఓట్లు ఒక్క గోబ్లిన్ పదానికి పట్టం కడుతూ పోలవడం విశేషం. దాదాపు 13 ఏళ్ల క్రితం నుంచీ గోబ్లిన్ పదం అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. కానీ, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో నెలల తరబడి కేవలం ఇంటికి, గదికే పరిమితమైన వారు మానసికంగా ‘గోబ్లిన్ మోడ్’లోకి వెళ్లిపోయారని అంతర్జాతీయంగా చర్చ కొనసాగిన విషయం విదితమే. ఈ పోటీలో మెటావర్స్(ఊహా ప్రపంచం) పదం రెండో స్థానంలో ఐ స్టాండ్ విత్ అనే పదం మూడో స్థానంలో నిలిచాయి.
➤ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్
Mixed Doubles: మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం సాధించిన శ్రీ కృష్ణ ప్రియ, తరుణ్
శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈఎల్ సాల్వడార్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారతీయ క్రీడాకారులు కుదరవల్లి శ్రీకృష్ణ ప్రియ, కోన తరుణ్‌లు సత్తా చాటారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ ద్వయం శ్రీకృష్ణ ప్రియ, తరుణ్‌లు రజత పతకం సాధించారు. ఈ ఇద్దరు క్రీడాకారులు చివరి 16 రౌండ్‌లో మెలి్వన్ కాల్జాడిల్లా, గాబ్రియేలా బారియోస్‌లను 21–7, 21–8 పాయింట్లతో ఓడించారు. క్వార్టర్స్‌లో వారు రెండో సీడ్ జోడీ గ్వాటెమాల క్రిస్టోఫర్ అలెగ్జాండర్, మరియానా ఇసాబెల్‌లను చిత్తు చేసి, వారి నాల్గవ టోర్నమెంట్‌లో స్పానిష్ జోడి అనియా సెటియన్, జోనాస్ మన్రాయ్‌ల చేతిలో 21–11, 21–17 పాయింట్లతో ఓడిపోయి రజతాన్ని సాధించారు.
➤ దేశంలోనే మొదటి జాతీయ జీవ సమాచార భాండాగారం ప్రారంభం
Vijayasai Reddy: రాజ్యసభ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
రాజ్యసభ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ నియమించారు. ఈ మేరకు డిసెంబర్ 5వ తేదీ ఉత్తర్వులు జారీచేశారు. తనకు వైస్ చైర్మన్‌గా అవకాశమిచ్చిన ఉప రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్ చైర్మన్ ప్యానల్‌లో అవకాశం కల్పించారు. వారిలో అస్సాంకు చెందిన భువనేశ్వర్ కలిఠా, కర్ణాటక నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ లంకప్ప హనుమంతయ్య ఉన్నారు.
Success Story : ఇంటర్‌లో పెళ్లి.. సెలవుల్లో కూలీ .. ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్‌లో ర్యాంకు