Biological information: దేశంలోనే మొదటి జాతీయ జీవ సమాచార భాండాగారం ప్రారంభం
Sakshi Education
ప్రభుత్వ సాయంతో జరిగిన పరిశోధనల ద్వారా సేకరించిన జీవ సంబంధ సమాచారాన్ని భద్రపరచడానికి దేశంలోనే మొదటి జాతీయ భాండాగారాన్ని ఇక్కడి ప్రాంతీయ బయోటెక్నాలజీ కేంద్రంలో ప్రారంభించారు.
దీనిలో 4 పెటాబైట్ల సమాచార నిధి ఏర్పాటుకు వసతులు ఉన్నాయి. బ్రహ్మ సూపర్ కంప్యూటర్ కూడా ఉంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించిన ఈ భాండాగారాన్ని ‘భారతీయ జీవ సంబంధ సమాచార నిక్షిప్త కేంద్రం’(ఐబీడీసీ)గా వ్యవహరిస్తున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 25 Nov 2022 06:14PM