Daily Current Affairs in Telugu: 21 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2. అనకాపల్లి జిల్లా చోడవరంలోని చోడవరం సహకార సంఘ చక్కెర కర్మాగారంలో గ్రీన్ ఫీల్డ్ బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
3. చంద్రయాన్–3 మిషన్‌లో రెండో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ కక్ష్య దూరాన్ని మరోసారి తగ్గించారు. అందులోని ఇంధనాన్ని ఆగస్టు 20 వేకువజామున 2 గంటలకు స్వల్పంగా మండించి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను రెండోసారి విజయవంతంగా పూర్తి చేశారు.
Daily Current Affairs in Telugu: 19 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. చందమామపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లూనా-25 ప్రయోగం విఫలమైంది. లూనా-25 సాంకేతిక సమస్య కారణంగా చంద్రుడిపై క్రాష్ లాండింగ్ అయినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ వెల్లడించింది.
5. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ బృందం మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం అందించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో అఖిల్ షెరాన్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం గెలిచింది. అఖిల్ షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అఖిల్ పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.
6. మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు 1–0 గోల్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించి విశ్వవిజేతగా అవతరించింది.
Daily Current Affairs in Telugu: 18 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
7. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ పసిడి పతకం సాధించాడు.
8. అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణ అమ్మాయి రంగు విరించి స్వప్నిక స్వర్ణ పతకం సాధించింది.
9. ఆసియా స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో అనాహత్ ఆసియా చాంపియన్‌గా అవతరించింది.
Daily Current Affairs in Telugu: 17 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
10. ప్రపంచకప్ స్టేజ్–4 ఈవెంట్‌లో పురుషుల కాంపౌండ్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ఓజస్ ప్రవీణ్, ప్రథమేశ్ జౌకర్‌లతో కూడిన భారత జట్టు అమెరికా జట్టుపై, మహిళల కాంపౌండ్‌లో జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్ కౌర్‌లతో కూడిన భారత బృందం పాయింట్ తేడాతో 234–233తో మెక్సికో జట్టుపై గెలిచి పసిడి పతకం చేజిక్కించుకున్నాయి.
11. జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో వ్రిత్తి అగర్వాల్ గ్రూప్–1 బాలికల విభాగంలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం సాధించి వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ప్ టైటిల్‌ను సాధించింది. శివాని కర్రా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్స్‌లో తెలంగాణకు రెండు రజత పతకాలు అందించింది.
12. అజర్‌బైజాన్‌లోని బాకూలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్ మేహులి ఘోష్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పసిడి పతకంతో సాధించింది.
Daily Current Affairs in Telugu: 16 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్