Skip to main content

Daily Current Affairs in Telugu: ఏప్రిల్‌ 1, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu April 1st 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
April 1st 2023 Current Affairs in Telugu

Richard Verma: అమెరికా ప్ర‌భుత్వంలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి
అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా భారతీయ అమెరికన్‌ రిచర్డ్‌ వర్మకు కీలక పదవి దక్కింది. శాఖకు సంబంధించిన నిర్వహణ, వనరుల వ్యవహారాలను ఆయన చూసుకుంటారు. దీన్ని అత్యంత శక్తిమంతమైన విదేశాంగ శాఖలో కీలకమైన సీఈఓ స్థాయి పోస్టుగా పరిగణిస్తుంటారు. 54 ఏళ్ల వర్మ నియామకాన్ని సెనేట్‌ 67–26 ఓట్లతో ఆమోదించింది. మాజీ దౌత్యవేత్త అయిన వర్మ ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్‌ సెక్రెటరీ (న్యాయ వ్యవహారాలు)గా కూడా పని చేశారు. 2015 నుంచి రెండేళ్లపాటు భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్నారు. వర్మ 1968లో అమెరికాలోని భారతీయ కుటుంబంలో జన్మించారు. అమెరికా వైమానిక దళ స్కాలర్‌షిప్‌తో కాలేజీ చదువు పూర్తి చేశారు. లాహిగ్‌ వర్సిటీ నుంచి బీఎస్, జార్జ్‌టౌన్‌ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ చేశారు. అనంతరం యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లో జడ్జ్‌ అడ్వొకేట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశాధ్యక్షుని నిఘా సలహా బోర్డులో, సామూహిక జనహనన ఆయుధాలు, ఉగ్రవాద కమిషన్‌ సభ్యునిగా చేశారు. ప్రస్తుతం మాస్టర్‌కార్డ్‌ చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్, గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా ఉన్నారు. ఫోర్డ్‌ ఫౌండేషన్‌తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక బోర్డుల్లో సభ్యునిగా, ట్రస్టీగా కొనసాగుతున్నారు. విదేశాంగ శాఖ నుంచి అత్యుత్తమ సేవా మెడల్, వైమానిక దళం నుంచి మెరిటోరియస్ సర్వీస్‌ మెడల్, కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారిన్‌ రిలేషన్స్‌నుంచి ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ ఫెలోషిప్‌ తదితరాలు  దక్కించుకున్నారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Amit Kshatriya: నాసా ‘మూన్‌ టు మార్స్‌’ చీఫ్‌గా భారత సంతతి వ్య‌క్తి!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్‌ టు మార్స్‌’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, రోబోటిక్స్‌ ఇంజనీర్‌ అయిన అమిత్‌ క్షత్రియ నియమితులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది. ‘మూన్‌ టు మార్స్‌’ కార్యక్రమానికి సారథ్యం వహించనున్న అమిత్‌ క్షత్రియ నాసా ఎక్స్‌ప్లోరేషన్‌ సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ డైరెక్టరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. 
ఇప్పటి వరకు ఆయన కామన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2003 నుంచి అంతరిక్ష కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్‌ నుంచి అమెరికా వలస వచ్చారు. క్షత్రియ విస్కాన్సిన్‌లోని బ్రూక్‌ఫీల్డ్‌లో పుట్టారు.

Mars and The Moon: చంద్రుడు, అంగారకుడిపై నీటి జాడలు!

Temple Floor Collapse: ఇండోర్‌ ఆలయంలో విషాదం.. 36కు చేరిన మరణాలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో బావి పైకప్పు కూలి ఇప్ప‌టివ‌ర‌కు 36 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్‌లోని బేలేశ్వర్‌ మహాదేవ్‌ ఝులే లాల్‌ ఆలయంలో మార్చి 30న‌ మెట్ల బావి పైకప్పు కూలింది. గల్లంతైన వారందరినీ వెలికితీశారు. ‘‘కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో గల్లంతైనట్లు భావిస్తున్న మొత్తం 36 మృతదేహాలను వెలికితీశాం. గాయపడిన మరో 17 మందిని ఆస్పత్రులకు తరలించాం. ఇద్దరిని ప్రథమ చికిత్స అనంతరం ఇళ్లకు పంపించి వేశాం’’ అని అధికారులు తెలిపారు. 
‘‘అన్వేషణ కార్యక్రమాన్ని ఆపలేదు. బావిలో పడిన స్లాబ్‌ శిథిలాలను, పూడిక మొత్తం తొలగించే పని ఇంకా కొనసాగుతోంది’’ సహాయ, రక్షణ కార్యక్రమాల్లో ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సంయుక్త బృందం బావిలోకి క్రేన్‌ను, ట్రాలీని దించి, మృతదేహాలను బయటకు తీసుకువచ్చింది.  
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక పటేల్‌నగర్‌లోని బేలేశ్వర్‌ మహాదేవ్‌ ఝులేలాల్‌ ఆలయంలో పూజా కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొందరు భక్తులు బావిపై కట్టిన స్లాబ్‌పై నిలబడి ఉండగా అది హఠాత్తుగా కూలింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Donald Trump: ముద్దాయి ట్రంప్‌!.. బెయిల్‌ లభిస్తుందా? 
 అమెరికా చరిత్రలో రాజకీయంగా మరో పెను సంచలనానికి తెరలేచింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందే చెప్పినట్టుగా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయి. పోర్న్ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌(స్టెఫానీ గ్రెగరీ క్లిఫర్డ్‌)తో లైంగిక సంబంధాలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బులు చెల్లించి అనైతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్న ఆరోపణల కేసులో డొనాల్డ్‌ ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ గ్రాండ్‌ జ్యూరీ నేరాభియోగాలు నమోదు చేసినట్టుగా ధ్రువీకరించింది. ట్రంప్‌ లాయర్లతో కేసు విచారణను పర్యవేక్షిస్తున్న మన్‌హట్టన్‌ అటార్నీ జనరల్‌ అల్విన్‌ బ్రాగ్‌ మాట్లాడారు. 
ట్రంప్‌ లొంగిపోవడానికి సహకరించాలని కూడా బ్రాగ్‌ సూచించారు. దీంతో ట్రంప్‌ క్రిమినల్‌ కేసు విచారణను ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొన్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టాలని కలలు కంటున్న వేళ నేరాభియోగాలు నమోదు కావడం నైతికంగా ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తనను అరెస్ట్‌ చేస్తారని, అదే జరిగితే రిపబ్లికన్‌ శ్రేణులు, తన అభిమానులు దేశవ్యాప్తంగా ఘర్షణలకు దిగాలని ఇప్ప‌టికే ఆయన పిలుపునిచ్చారు.

Donald Trump: ట్రంప్‌ అరెస్టవ‌వుతాడా.. ట్రంప్‌పైనున్న కేసు ఏమిటి..?
కేసు నేపథ్యం ఇదీ..
2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ తనతో ఉన్న లైంగిక సంబంధాలను బయటపెట్టకుండా ఉండేందుకు పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ను డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలున్నాయి. అధ్యక్షుడిగా తన పరువు తీయకుండా ఉండడానికి ట్రంప్‌ లక్షా 30 వేల డాలర్లను అప్పట్లో తన లాయర్‌ మైఖేల్‌ కొహెన్‌ ద్వారా ముట్టజెప్పినట్టు డేనియల్స్‌ ఆరోపించారు. ఆ ఒప్పందం చెల్లదంటూ 2018లో ఆమె కోర్టుకెక్కారు. 2006 సంవత్సరంలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గోల్ఫ్‌కోర్టులో ట్రంప్‌ పరిచయమయ్యారని, తనతో గడిపితే ఆయన నిర్వహించే రియాల్టీ షో ’ది అప్రెంటీస్‌’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించారని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు. 
ఆ తర్వాత తరచూ ఫోన్‌లో మాట్లాడేవారని 2007లో కలిసినప్పుడు ట్రంప్‌తో సన్నిహితంగా గడపడానికి నిరాకరించానని, అందుకే తనకు ఆ షో లో అవకాశం ఇవ్వకుండా ముఖం చాటేశారని తెలిపారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్‌ ఆరోపించారు. అయితే ట్రంప్‌ ఆమె ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇప్పుడు జ్యూరీ అభియోగాలు నమోదు చేయడంతో డేనియెల్స్‌ తన మద్దతుదారులందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎన్నో సందేశాలు వస్తున్నా స్పందించలేకపోతున్నానని, సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నానని ట్వీట్‌ చేశారు. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో.. ట్రంప్‌కి పోటీగా ఆయ‌న‌ వీరవిధేయులే!

IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా ధోని నిలిచాడు. ఐపీఎల్ 2023లో భాగంగా మార్చి 31న గుజరాత్‌ టైటాన్స్‌, సీఎస్‌కే మ‌ద్య తొలి మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన ఫీట్‌ సాధించాడు. ధోని 41 సంవ‌త్స‌రాల‌ 267 రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు. 
ఇప్పటి వరకు ఈ రికార్డు దివంగత ఆస్ట్రేలియా స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ పేరిట ఉండేది. ఐపీఎల్ 2011 సీజన్‌లో 41 సంవ‌త్స‌రాల‌ 249 వయస్సులో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా షేన్‌ వార్న్‌ వ్యవహరించారు. తాజా మ్యాచ్‌తో వార్న్ పేరిట ఉన్న 12 ఏళ్ల రికార్డును మిస్టర్‌ కూల్ బ్రేక్‌ చేశాడు. 
ఇక తొలి మ్యాచ్‌ విషయానికి వస్తే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో పోటీప‌డిన‌ చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొద‌ట సీఎస్కే చేసిన 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.   

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..

Foreign Trade Policy: విదేశీ వాణిజ్య పాలసీని ప్రకటించిన కేంద్రం  
ఎగుమతులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్‌టీపీ)ని భారత్‌ ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్‌ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించింది. అంతేకాకుండా ఈకామర్స్‌ ఎగుమతులకు ప్రోత్సాహకాలను అందించాలని కూడా ప్రతిపాదించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ మార్చి 30న‌ ప్రవేశపెట్టిన ఎఫ్‌టీపీ 2023 ప్రకారం రాయితీల జమానా నుంచి ప్రోత్సాహకాల దిశగా మారేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఎగుమతిదారులు, రాష్ట్రాలు, జిల్లాలు, భారతీయ మిషన్‌ల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించనున్నారు. లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం, మరిన్ని ఎగుమతి హబ్‌లను అభివృద్ధి చేయడం కూడా తాజా పాలసీలో భాగం. 

UPI Payments: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. కానీ వారికి మాత్రం..
డైనమిక్‌ పాలసీ.. 
గతంలో అయిదేళ్లకోసారి ప్రకటించే ఎఫ్‌టీపీల మాదిరిగా కాకుండా ఈసారి ప్రభుత్వం డైనమిక్‌ అలాగే పరిస్థితులకు అనుగుణంగా స్పందించే పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీకి గడువు ముగింపు అంటూ ఏదీ ఉండదు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా పాలసీని సవరిస్తారు. ‘ఈ పాలసీకి గడువు తేదీ ఏదీ లేదు, కాలానుగుణంగా మార్పులు చేయడం జరుగుతుంది’ అని పాలసీ ఆవిష్కరణ అనంతరం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీటీఎఫ్‌టీ) సంతోష్‌ సారంగి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు మరిన్ని ప్రాంతాలకు భారీగా విస్తరించే విధంగా వాణిజ్య శాఖ చర్యలు చేపడుతుందని మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. రంగాల వారీగా లేదంటే దేశాల వారీగా దృష్టి పెడతామన్నారు. వచ్చే 4–5 నెలల్లో విదేశాల్లోని భారతీయ మిషన్‌లతో కలిసి వాణిజ్య శాఖ ఈ దిశగా చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Tax Relief: ట్యాక్స్ పేయర్లకు ఊరట.. నిర్మలా సీతారామన్ కీల‌క నిర్ణ‌యం!

Wimbledon Players: రష్యా, బెలారస్‌ టెన్నిస్‌ ఆటగాళ్లపై నిషేధం ఎత్తివేసిన ‘వింబుల్డన్‌’ నిర్వాహకులు
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది రష్యా, బెలారస్‌ టెన్నిస్‌ క్రీడాకారులపై ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ నిషేధం విధించింది. దాంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రష్యా, బెలారస్‌ క్రీడాకారులు పాల్గొనలేకపోయారు. అయితే ఈ ఏడాది రష్యా, బెలారస్‌ క్రీడాకారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నామని, వారు తటస్థ క్రీడాకారుల హోదాలో పాల్గొనవచ్చని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ తెలిపింది. దాంతో పురుషుల విభాగంలో స్టార్స్‌ మెద్వెదెవ్, రుబ్లెవ్, ఖచ నోవ్‌ (రష్యా), మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా, ఈ ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ విజేత అరీనా సబలెంకా (బెలారస్‌) వింబుల్డన్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది.

Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్‌ పేరు

Published date : 01 Apr 2023 06:20PM

Photo Stories