Skip to main content

Daily Current Affairs in Telugu: ఏప్రిల్‌ 17, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu April 17th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
April 17th 2023 Current Affairs

Atiq Ahmed shootout: అతీక్‌ సోదరుల హత్య.. ఇద్దరి తలల్లోకి దూసుకెళ్లిన తూటాలు! చుట్టూ వలయంగా పోలీసులు. ఎదురుగా మీడియా. విలేకరుల ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఇంతమందీ చూస్తుండగానే ముగ్గరు యువకులు శరవేగంగా దూసుకొచ్చారు. పిస్టళ్లు తీసి నేరుగా తలలకు గురి పెట్టి పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులకు దిగారు. అంతే..! పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, మాజీ రాజకీయ నాయకుడు అతీక్‌ అహ్మద్‌ (60), ఆయన సోదరుడు అష్రఫ్‌ అక్కడికక్కడే నేలకొరిగారు. ఇద్దరి శరీరాలూ తూటాలతో తూట్లు పడ్డాయి. తాము పుట్టి పెరిగిన, నేర సామ్రాజ్యానికి కేంద్రంగా మలచుకున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోనే వారి కథ అలా ముగిసిపోయింది. అతీక్‌ మూడో కుమారుడు అసద్‌ను ఏప్రిల్ 13న‌ యూపీ పోలీసులు ఝాన్సీలో ఎన్‌కౌంటర్ చేయ‌గా, అతని అంత్యక్రియలు ఏప్ర‌ల్ 15న ప్రయాగ్‌రాజ్‌లో ముగిశాయి. వాటిలో పాల్గొనాలన్న అతీక్‌ కోరిక తీరకపోగా రాత్రికల్లా సోదరునితో సహా తానూ కడతేరిపోయాడు. ఈ జంట హత్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. యూపీలో సీఎం యోగి సారథ్యంలో సాగుతున్న ఎన్‌కౌంటర్ల పరంపరకు ఇది కొనసాగింపంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి.

National Party: ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఉండాల్సిన అర్హతలివే..
మీడియాతో మాట్లాడుతుండగానే..
పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ అయిన అతీక్‌పై 100కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకు ప్రధాన సాక్షి ఉమేశ్‌పాల్‌ను హత్య చేసిన కేసులో విచారణ నిమిత్తం అతీక్‌ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్‌ సెంట్రల్‌ జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చారు. అసద్‌ అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధూమన్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్లో వారిని ఏప్రిల్ 15న విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు ఎంఎల్‌ఎన్‌ వైద్య కళాశాలకు తరలించారు.  పూర్తి స‌మాచారానికి ఇక్క‌డ క్లిక్ చేయండి

Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూప‌క‌ర్త‌, విగ్రహ ప్రత్యేకతలివే..

పాంతీయభాషల్లోనూ సీఏపీఎఫ్‌ పరీక్ష 
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతినిచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా ఏప్రిల్ 15న‌ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) పరిధిలోకి సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) వస్తాయి. సీఆర్‌పీఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం నిర్వహించే పరీక్షల్లో తమిళం కూడా చేర్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (05-11 మార్చి 2023)

National Athletics Grand Prix: జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్లో జ్యోతికశ్రీకి స్వర్ణం, రజితకు రజతం   
బెంగళూరులో జరుగుతున్న జాతీయ అథ్లెటిక్స్‌ ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్లు మెరిశారు. మహిళల 400 మీటర్ల పరుగులతో దండి జ్యోతికశ్రీ స్వర్ణ పతకం సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుంజా రజితకు రజతం దక్కింది. జ్యోతిక 54.15 సెకన్లతో అగ్రస్థానంలో, రజిత 55.57 సెకన్లతో రెండో స్థానంలో నిలిచారు. మరో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి రొంగలి స్వాతి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. 56.84 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసిన స్వాతి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో ట్వింకిల్‌ పున్దిర్‌ (మధ్యప్రదేశ్‌ – 56.75 సెకన్లు) మూడో స్థానం సాధించింది.   

Lifetime MCC Membership: మిథాలీ, ధోని, యువరాజ్‌లకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం

Andrey Rublev: రుబ్లెవ్‌ ఖాతాలో తొలి ‘మాస్టర్స్‌’ టైటిల్‌ 
మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్ టోర్నీలో రష్యా ప్లేయర్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ విజేతగా నిలిచాడు. మొనాకోలో ఏప్రిల్ 16న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ రుబ్లెవ్‌ 5–7, 6–2, 7–5తో తొమ్మిదో ర్యాంకర్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌)పై నెగ్గాడు. రుబ్లెవ్‌ కెరీర్‌లో ఇదే తొలి ‘మాస్టర్స్‌’ సిరీస్‌ టైటిల్‌. మూడో సెట్‌లో రుబ్లెవ్‌ 1–4తో వెనుకబడి పుంజుకున్నాడు. విజేత రుబ్లెవ్‌కు 8,92,590 యూరోల (రూ. 8 కోట్లు) ప్రైజ్ మనీతో పాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

FIFA Rankings: ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా అర్జెంటీనా

Ranji Trophy: రంజీ ట్రోఫీ విజేతకు రూ.5 కోట్లు 
దేశవాళీ క్రికెట్‌ టోర్నీల ప్రైజ్‌మనీ మొత్తాన్ని బీసీసీఐ భారీగా పెంచింది. ఈ ఏడాది నుంచి రంజీ ట్రోఫీ చాంపియన్‌కు రూ.2 కోట్లు బదులు రూ.5 కోట్లు చెల్తిస్తారు. రన్నరప్‌ జట్టుకు రూ.3 కోట్లు.. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు రూ.1 కోటి చొప్పున లభిస్తాయి. దులీప్‌ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ విజేతలకు రూ.1 కోటి చొప్పున.. ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నీ విజేతకు రూ.80 లక్షలు లభిస్తాయి. సీనియర్‌ మహిళల వన్డే టోర్నీ చాంపియన్‌కు రూ.50 లక్షలు.. టి20 టోర్నీ విజేతకు రూ.40 లక్షలు చెల్లిస్తారు.   

Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్‌ పేరు

Femina Miss India 2023: ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా నందినీ గుప్తా   
ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌– 2023గా రాజస్తాన్‌కు చెందిన నందినీ గుప్తా(19) ఎంపికయ్యారు. మిస్ ఇండియా 2023 గ్రాండ్ ఫినాలే(59వ ఆడిషన్‌ ఫైనల్స్‌) మణిపుర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అందాల పోటీల్లో నందిని గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. కాగా ఫెమినా మిస్ ఇండియా పోటీలు భారత్‌లోనే అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్‌గా పరిగణిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల‌ నుంచి ఎంతోమంది అందమైన అమ్మాయిలు ఇందులో పాల్గొంటారు. మిస్ ఇండియాగా ఎంపికైన నందినీ గుప్తా మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. 59వ ఆడిషన్‌ ఫైనల్స్‌లో ఢిల్లీకి చెందిన షెర్యా పూంజా ఫస్ట్‌ రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన స్ట్రెలా లువాంగ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు.  

Shah Rukh Khan: టైమ్‌ 100 అగ్రస్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌

Strange Birds: ఈకల్లో విషం.. తాకితే త‌ప్ప‌దు మరణం.. రెండు రకాల విషపూరిత పక్షులను గుర్తించిన సైంటిస్టులు

పక్షులంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండ‌రు. కానీ పక్షులను తాకితేనే చనిపోయేంతటి ప్రమాదం ఉంటుందని మ‌నం ఇప్పటి వరకు ఎక్క‌డా విని ఉండం. అయితే ముట్టుకుంటే చాలు క్షణాల్లో ప్రాణాలు తీసే భయంకరమైన రెండు రకాల పక్షులను న్యూగినియా అడవుల్లో డెన్మార్క్‌ పరిశోధకులు గుర్తించారు. అవి వాటి ఈకల్లో విషం దాచుకుంటున్నట్లు కనిపెట్టారు. వాటిని ఇంట్లో పెంచుకోలేం, ఆహారం ఇవ్వలేం. విషపూరిత పక్షుల సమీపంలోకి వెళ్లడం కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.  
☛ అడవుల్లో విషపూరిత ఫలాలు, పదార్థాలను ఆరగించి, వాటిని న్యూరోటాక్సిన్లుగా మార్చి, తన రెక్కల్లో నిల్వ చేసుకొనే సామర్థ్యం ఈ పక్షుల్లో అభివృద్ధి చెందింది.
☛ విష ప్రభావాన్ని తట్టుకొని జీవించే శక్తి సమకూరింది.  
☛ కాలానుగుణంగా వాటి శరీరంలో సంభవించిన జన్యుపరమైన మార్పులే ఇందుకు కారణమని డెన్మార్క్‌లోని నేచురల్‌ హస్టరీ మ్యూజియం ప్రతినిధి  జాన్సన్‌ చెప్పారు.  

Earthquake: భూకంపాన్ని ముందే పసిగట్టే పక్షులు, జంతువులు! 
☛ ఇటీవల న్యూగినియా అడవుల్లో పర్యటన సందర్భంగా ఈ పక్షులను గుర్తించామని ఒక ప్రకటనలో వెల్లడించారు.   
☛ తాజాగా గుర్తించిన రెండు రకాల విషపూరిత పక్షులు రిజెంట్‌ విజ్లర్‌(పచీసెఫాలా స్ల్కీగెల్లీ), రఫోస్‌–నేప్డ్‌ బెల్‌బర్డ్‌(అలిడ్రియాస్‌ రుఫినుచా) అనే పక్షి జాతులకు చెందినవి. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో ఈ జాతులు అధికంగా కనిపిస్తుంటాయి.  
☛ సౌత్, సెంట్రల్‌ అమెరికాలో ఉండే డార్ట్‌ కప్పలు (గోల్డెన్‌ పాయిజన్‌ ఫ్రాగ్స్‌) అత్యంత విషపూరితమైనవి చెబుతుంటారు. ఈ కప్పలను తాకితే కొద్దిసేపట్లోనే మరణం సంభవిస్తుంది.  
☛ డార్ట్‌ కప్పల్లోని విషం లాంటిదే ఈ పక్షుల్లోనూ ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు.  
☛ పక్షుల్లో బాట్రాసోటాక్సిన్‌ అనే విషం అధిక మోతాదులో ఉందని సైంటిస్టులు పేర్కొన్నారు.  
☛ ఇలాంటి విషమే గోల్డెన్‌ పాయిజన్‌ కప్పల చర్మంలో ఉంటుంది.
☛ విషం నిల్వ ఉన్న ఈ పక్షుల ఈకలను తాకితే కండరాల్లో పక్షవాతం లాంటిది ఏర్పడుతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. చివరకు మృత్యువు కాటేస్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతోంది.  
☛ పక్షుల శరీరంలో సోడియం చానళ్లను క్రమబద్ధం చేసే ప్రాంతాల్లో మ్యుటేషన్స్‌(మార్పులు) వల్ల వాటిలో విషాన్ని తయారు చేసుకొని నిల్వచేసుకోవడంతోపాటు తట్టుకొనే శక్తి స్వతంత్రంగానే అభివృద్ధి చెందిందని సైంటిస్టులు పేర్కొన్నారు.     

Kalivi Kodi : పగలు నిద్ర.. రాత్రి వేటా.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ ప‌క్షి కోసం ఇప్ప‌టికే..

Guinness World Record: గిన్నిస్‌ రికార్డు.. గంటలో 3,206 పుష్‌ అప్‌లు  
జిమ్‌ చేసే సిక్స్‌ప్యాక్‌ బాడీ అయినా రోజూ 100 పుష్‌అప్‌లు చేస్తేనే బాగా అలిసిపోతారు. అలాంటిది ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి కేవలం గంటలో 3,206 పుష్‌అప్‌లు చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లుకాస్‌ హెల్మెక్‌ పుష్‌ అప్‌లు చేయడం ద్వారా తనకున్న స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించాడు. గంటకి 3,182 పుష్‌ అప్‌లు చేసి రికార్డు సాధించిన సాటి ఆ్రస్టేలియన్‌ డేనియల్‌ స్కాలి పేరు మీదున్న రికార్డుల్ని బద్దలు కొట్టాడు. లుకాస్‌ నిమిషానికి 53 పుష్‌ అప్‌లు చేశాడని గిన్నిస్‌ వరల్డ్‌ అధికారులు వెల్లడించారు. ఈ రికార్డు సాధించడానికి అనుభవజు్ఞలైన జిమర్‌ల దగ్గర రెండు మూడేళ్ల పాటు శిక్షణ కూడా తీసుకున్నట్టు లుకాస్‌ వెల్లడించాడు.  

World's Youngest Author: గిన్నిస్‌ రికార్డు.. నాలుగేళ్ల‌కే పుస్తకాన్ని రాసి ప్రచురించిన బాలుడు

Aquarium In Hyderabad: హైద‌రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద టన్నెల్‌ ఆక్వేరియం.. 
ఐటీ, టూరిజం రంగాల్లో హైదరాబాద్ శరవేగంగా దూసుకెళ్తోంది. కాగా ప్ర‌స్తుతం దేశంలోనే అతిపెద్ద అక్వేరియాన్ని తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మిస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్‌లో ఈ అక్వేరియం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. పక్షుల ఆవాస కేంద్రంగానూ ఇది ఆవిర్భవించనుంది. ఈ ఆక్వేరియం త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.
హైదరాబాద్‌లో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని నిర్మించే అవకాశాలను పరిశీలించాలంటూ ఓ నెటిజన్ చేసిన సూచనలకు కేటీఆర్ స్పందించారు. దేశంలోనే అతిపెద్ద అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని నిర్మిస్తోన్నామని, కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయ‌ని చెప్పారు. కాగా 2022 అక్టోబర్‌లో మంత్రి కేటీ రామారావు కొత్వాల్‌గూడలో ఎకో పార్క్‌కు శంకుస్థాపన చేశారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons in News) క్విజ్ (05-11 మార్చి 2023)

Published date : 17 Apr 2023 06:22PM

Photo Stories