50 ఏళ్లలో 8.5 సెం.మీ. పెరిగిన సముద్రమట్టం
Sakshi Education
50 ఏళ్లలో భారత తీరం వెంబడి సముద్రమట్టం 8.5 సెంటీమీటర్లు పెరిగిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో నవంబర్ 19న రాజ్యసభకు తెలిపారు.

గ్లోబల్ వార్మింగ్‌తో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదు దశాబ్దాల్లో భారత తీరం వెంబడి సముద్ర మట్టం సగటున సంవత్సరానికి సుమారు 1.70 మిల్లీమీటర్లు పెరిగిందన్నారు. శాటిలైట్ అల్టిమెట్రి, మోడల్ సిమ్యులేషన్ ప్రకారం 2003-13 మధ్య ఉత్తర హిందూ మహా సముద్రం వైవిధ్యతను ప్రదర్శించిందని, సంవత్సరానికి 6.1 మి.మీ మేర పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. సునామీ, తుఫాను ప్రభావం, తీర ప్రాంతంలో వరదలు కూడా సముద్రమట్టం పెరుగుదలకు కారణమవుతాయన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 50 ఏళ్లలో 8.5 సెం.మీ. పెరిగిన సముద్రమట్టం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో
ఎక్కడ : భారత తీరం వెంబడి
క్విక్ రివ్యూ :
ఏమిటి : 50 ఏళ్లలో 8.5 సెం.మీ. పెరిగిన సముద్రమట్టం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో
ఎక్కడ : భారత తీరం వెంబడి
Published date : 20 Nov 2019 04:49PM