Daily Current Affairs in Telugu: 18 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
![Latest Current Affairs for Exams, Daily Current Affairs Updates, 18 november Daily Current Affairs in Telugu, Competitive Exam Preparation,](/sites/default/files/images/2023/11/20/daily-18-1700449253.jpg)
1. ఏపీ నిట్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యుడు డాక్టర్ రఫీ మహ్మద్ ఇటీవల ముంబైలో ‘కొరోషన్ అవేర్‌నెస్’ అవార్డు అందుకున్నారు.
2. జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేస్తోంది.
Daily Current Affairs in Telugu: 16 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. 'చాట్‌జీపీటీ 'సృష్టి కర్త 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓగా ఓపెన్‌ఏఐ తొలగించిన వెంటనే.. ఈ బాధ్యతలను తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 'మీరా మురాటి' స్వీకరించింది.
4. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1991 బ్యాచ్ సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారి అలోక్ శర్మను ప్రధాన మంత్రి రక్షణ బాధ్యతలను చూసే ‘ప్రత్యేక భద్రతా దళం’ (ఎస్‌పీజీ) డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
5. ఒమిక్రాన్ వేరియంట్ ఉత్పరివర్తనమై బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Daily Current Affairs in Telugu: 15 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్