Daily Current Affairs in Telugu: 16 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. నవంబర్ 13న శీతల్ మహాజన్ ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది.
2. భారత్ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి.
Daily Current Affairs in Telugu: 15 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఎగ్జోబయోలజీ ఎక్స్‌టంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్‌ఎస్)’ పేరుతో సరికొత్త రోబోను తయారుచేసింది. చంద్రుడు, అంగారక గ్రహంపై జీవం పుట్టుక ఆనవాళ్లను పసిగట్టడానికి ఈ రోబో ఉపయోగపడనుంది.
4. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనీస్ కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబిట్‌ల డేటాను ప్రసారం చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.
Daily Current Affairs in Telugu: 14 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
5. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించేందుకు అడిషనల్ సొలి సి టర్ జనరల్ (ఏఎస్‌జీ)గా సీనియర్ న్యాయవాది బి.నరసింహ శర్మను నియమించింది.
6. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గిరిజనుల సంక్షేమం కోసం రూ.24,000 వేల కోట్లతో అమలు చేసే ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
7. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య రష్యా నుంచి 36.27 బిలియన్ డాలర్లు విలువైన (రూ.3.01లక్షల కోట్లు) దిగుమతులు నమోదయ్యాయి.
Daily Current Affairs in Telugu: 10 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్