Daily Current Affairs in Telugu: 14 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు.
2. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నికరంగా రూ. 10.60 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 22 శాతం పెరిగాయి.
Daily Current Affairs in Telugu: 10 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. రెండు నెలల నుంచి దిగివస్తున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల అక్టోబర్‌లోనూ మరింత తగ్గింది. తాజా సమీక్షా నెల్లో 4.87 శాతంగా (2022 అక్టోబర్ నెలతో పోల్చి) నమోదయ్యింది.
4. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్ ప్రకటించారు.
5. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి అందిస్తున్న సేవల్లో అక్టోబర్‌లోనూ తిరుపతి జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.
Daily Current Affairs in Telugu: 09 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
6. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
7. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో ఏర్పాటు చేసిన ఏఎంటీజెడ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ఆమోదముద్ర వేసింది.
Daily Current Affairs in Telugu: 08 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్