Skip to main content

Daily Current Affairs in Telugu: 08 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
08 November Daily Current Affairs in Telugu, sakshi education daily current affairs

1.  రాష్ట్ర బాధ్యతాయుత టూరిజం మిషన్ ఆధ్వర్యంలో  2023 సంవత్సరానికిగాను కేరళ ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు’ని కైవసం చేసుకుంది.

2. సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని ఫొటో తీసింది. 

Daily Current Affairs in Telugu: 06 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రతిష్టాత్మక 'ఛేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌ను గెలుచుకుంది. 

4. మహిళల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) తొలిసారి విజేతగా నిలిచి మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 

Daily Current Affairs in Telugu: 04 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

5. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ దీవిలో జరిగిన స్విస్‌ గ్రాండ్‌ టోర్నీలో ఓపెన్‌ విభాగంలో విదిత్‌ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్‌గా అవతరించారు. 

6. కేంద్ర సమాచార కమిషన్‌ (సెంట్రల్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌) ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్‌ సమారియా బాధ్యతలు స్వీకరించారు.

Daily Current Affairs in Telugu: 02 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 09 Nov 2023 08:16AM

Photo Stories