Skip to main content

Daily Current Affairs in Telugu: 04 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
 04 November Daily Current Affairs in Telugu

1. రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంలో రాష్ట్ర గవర్నర్‌ అరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆక్షేపించింది. బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖ లు చేసింది.

2. బెంగళూరు సమీపంలో ఓ వ్యక్తికి జికా వైరస్  పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిక్కబళ్లాపూర్ పరిధిలోని ఓ దోమలో జికా వైరస్‌ బయటపడినట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. 

Daily Current Affairs in Telugu: 02 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఇండోనేసియా ఆగ్నేయప్రాంతంలో  భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైంది.

4. వ్యవసాయ శాఖ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదిక ప్రకారం ఖరీఫ్‌లో ఈసారి 144 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అధికారులు వెల్లడించారు.

5. జాతీయ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్‌ వృత్తి అగర్వాల్‌  ఐదో పతకాన్ని సొంతం చేసుకుంది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో  వృత్తి (4ని:30.03 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకుంది. 

Daily Current Affairs in Telugu: 31 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 04 Nov 2023 07:55PM

Photo Stories