Skip to main content

Daily Current Affairs in Telugu: 31 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
31st October Daily Current Affairs in Telugu
31st October Daily Current Affairs in Telugu

1. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాథన్‌ నరేందర్‌ సోమవా­రం ప్రమాణం చేశారు.

2. అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ ప్రతిష్టాత్మక బాలన్‌ డి'ఓర్ అవార్డు గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో బాలన్‌ డి'ఓర్ అవార్డును స్పెయిన్‌ ఫుట్‌బాలర్‌, బార్సిలోనా సెంట్రల్‌ మిడ్‌ ఫీల్డర్‌ ఎయిటనా బొన్‌మాటి దక్కించుకుంది.

Daily Current Affairs in Telugu: 30 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 

4. జాతీయ క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీకి స్వర్ణ పతకం లభించింది. మహిళల స్విమ్మింగ్‌ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో వ్రితి అగర్వాల్‌ రజత పతకం సాధించింది.

5. ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో  అనీశ్‌ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. పురుషుల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో హైదరాబాద్‌ షూటర్‌ కైనన్‌ షెనాయ్, జొరావర్‌ సింగ్‌ సంధూ, పృథ్వీరాజ్‌ తొండైమన్‌లతో కూడిన భారత జట్టుకు రజత పతకం దక్కింది.

Daily Current Affairs in Telugu: 28 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

6. బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీహెచ్‌ఈఎల్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

7. నీతా అంబానీ 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు.

8. నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (NCLAT) జ్యూడిషియల్‌ సభ్యుడు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Daily Current Affairs in Telugu: 27 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 31 Oct 2023 07:17PM

Photo Stories