Skip to main content

Daily Current Affairs in Telugu: 30 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
 30th October Daily Current Affairs in Telugu
30th October Daily Current Affairs in Telugu

1. భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన బ్రెస్ట్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–జూలియన్‌ క్యాష్‌ (బ్రిటన్‌) ద్వయం విజేతగా నిలిచింది.

2. జాతీయ క్రీడల్లో ఆదివారం జరిగిన మహిళల స్విమ్మింగ్‌ 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్‌ కాంస్య పతకం గెలిచింది. వ్రితి 200 మీటర్ల దూరాన్ని 2ని:09.42 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది.

Daily Current Affairs in Telugu: 28 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. జూనియర్‌ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ ప్లేయర్‌ కొడవలి తనిష్క్‌ మురళీధర్‌ నాయుడు, రాజ్‌కన్వర్‌ సింగ్‌ సంధూ, సమీర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం కైవసం చేసుకుంది.

4. ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ జాహిద్‌ హుస్సేన్‌ రజత పతకం సొంతం చేసుకున్నాడు.

5. భారత్‌ సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించింది.

6. ఇద్దరు భారతీయ సంతతి శాస్త్రవేత్తలకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అశోక్‌ గాడ్గిల్‌కు నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ అవార్డు దక్కింది. మరో భారత సంతతి శాస్త్రవేత్త సుబ్రా సురేశ్‌కు నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ పురస్కారం లభించింది.

Daily Current Affairs in Telugu: 27 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

7. గాజాపై ఇజ్రాయెల్‌ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. 

8. భారతదేశపు ప్రముఖ టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 'జియోస్పేస్ ఫైబర్' బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టింది. 

9. పారా ఆసియా క్రీడల్లో భారత్‌ 111 పతకాలతో భారత్‌ టాప్‌–5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలున్నాయి. చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచారు. రెండో మూడు స్థానాల్లో ఇరాన్‌ (131), జపాన్‌ (150) వరుసగా నిలిచాయి. 

Daily Current Affairs in Telugu: 26 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 30 Oct 2023 07:21PM

Photo Stories