Daily Current Affairs in Telugu: 26 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. ఆసియా పారా క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో సుమిత్ అంటిల్ జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం గెలిచాడు.జావెలిన్ త్రో ఎఫ్46 కేటగిరీలో భారత్‌కే చెందిన సుందర్ సింగ్ గుర్జర్ జావెలిన్‌ను 68.60 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం గెలిచాడు.
2. ఆసియా పారా క్రీడల్లో పురుషుల టి11 1500 మీటర్ల విభాగంలో అంకుర్ ధామా, మహిళల టి11 1500 మీటర్ల విభాగంలో రక్షిత రాజు, పురుషుల ఎఫ్37/38 జావెలిన్ త్రో ఈవెంట్‌లో హనే, మహిళల టి47 లాంగ్‌జంప్ ఈవెంట్‌లో నిమిషా బంగారు పతకాలు గెలిచారు.
Daily Current Affairs in Telugu: 25 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. జాతీయ క్రీడల్లో భాగంగా వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో పురుషుల 55 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్. గురు నాయుడు ఓవరాల్‌గా 230 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 45 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని మొత్తం 161 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
4. ఆసియా పారా క్రీడల షాట్‌పుట్ విభాగంలో రొంగలి రవి రజత పతకం సాధించాడు.
5. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆత్మకథ రాశారు. ‘నిలవు కుడిచ సింహగల్ (వెన్నెల గ్రోలిన సింహాలు)’ పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది.
Daily Current Affairs in Telugu: 23 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్