Skip to main content

Daily Current Affairs in Telugu: 27 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
27th October Daily Current Affairs in Telugu
27th October Daily Current Affairs in Telugu

1. ప్రపంచ దేశాల్లోని అగ్రశ్రేణి మేనేజ్‌మెంట్‌ కాలేజీల జాబితాతో కూడిన క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌–2024లో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ప్రపంచ టాప్‌–100 బి–స్కూల్స్‌ ర్యాంకుల్లో 78వ స్థానంలో నిలిచింది. 

2. ఆసియా పారా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో పురుషుల ఎఫ్‌46 కేటగిరీ షాట్‌పుట్‌ ఈవెంట్‌లో సచిన్‌ సర్జేరావు ఖిలారి ఇనుప గుండును 16.03 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు.

Daily Current Affairs in Telugu: 26 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఆసియా పారా క్రీడల్లో  ఆర్‌6 మిక్స్‌డ్‌ 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో భారత షూటర్‌ సిద్ధార్థ బాబు 247.7 పాయింట్లు స్కోరు పసిడి పతకాన్ని సాధించాడు. ఆర్చరీలో శీతల్‌ దేవి–రాకేశ్‌ కుమార్‌ జోడీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో 151–149తో లిన్‌ యుషాన్‌–అయ్‌ జిన్‌లియాంగ్‌ (చైనా) జంటపై నెగ్గి బంగారు పతకాన్ని దక్కించుకుంది. 

4. భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష విధించారు.   

5. ఈక్వెడార్‌ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియెల్‌ నొబోవా ఎన్నికయ్యారు. 

Daily Current Affairs in Telugu: 25 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 28 Oct 2023 12:11PM

Photo Stories