Daily Current Affairs in Telugu: 08 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపంలో స్వల్ప దూరాలను ఛేదించగల, ప్రయోగ దశలో ఉన్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని–1ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ప్రకటించింది.
2. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించింది.
Daily Current Affairs in Telugu: 07 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా జూనియర్, సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్ శశివర్ధన్ ఐదు స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు.
4. గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారత విద్యార్థులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2018 నుంచి ఇప్పటివరకు కెనడా వెళ్లిన 91 మంది విద్యార్థులు, యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు వెళ్లిన 48 మంది విద్యార్థులు చనిపోయారు.
5. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టెక్ దిగ్గజం గూగుల్ 'గూగుల్ జెమిని' పేరుతో అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్ పరిచయం చేసింది.
Daily Current Affairs in Telugu: 06 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
6. పార్లమెంట్‌లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్‌కు చెందిన తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడింది.
7. జెడ్‌ఎన్‌పీ అధినేత లాల్దుహోమా చేత మిజోరం ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు.
8. రష్యా అధ్యక్ష పదవికి 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
Daily Current Affairs in Telugu: 05 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్